- Telugu News Photo Gallery Cinema photos Vijay Deverakonda Kingdom Movie OTT Streaming Date Fixed to stream on Netflix from August 27th
Kingdom OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కింగ్డమ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే కింగ్డమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ నటించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈమూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందామా.
Updated on: Aug 25, 2025 | 5:41 PM

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటేస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కింగ్డమ్. గత నెలలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత ఫుల్ టైమ్ మాస్ ఎంటర్టైన్మెంట్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో విజయ్ యాక్టింగ్ జనాలను కట్టిపడేసింది.

డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించింది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీకి అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఆగస్ట్ 27 నుంచి స్ట్రీమంగ్ కానుందని వెల్లడించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కానుంది.

కింగ్ డమ్ విషయానికి వస్తే..సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలోనే పోలీస్ అధికారులతో సూరికి గొడవ జరుగుతుంది.

శివ ఆచూకి శ్రీలంక సమీపంలోని ఓ ద్వీపంలో ఉందని, గూఢచారిగా అక్కడ పనిచేయాలని చెబుతారు. అన్న కోసం శ్రీలంకలో అడుగుపెట్టిన సూరికి అక్కడ శివ దొరికాడా లేడా అనేది సినిమా.




