- Telugu News Photo Gallery Cinema photos Samantha Ruth Prabhu Producer, Actress, and Now Director know the details
Samantha: దానిలోనూ నా టాలెంట్ ఏంటో చూపిస్తా.. మరోసారి హెడ్ లైన్స్‌లో సమంత
కప్పు ముఖ్యం బిగిలూ అన్నట్లు.. హెడ్ లైన్స్‌లో ఉండటం ముఖ్యం బిగిలూ అంటున్నారు సమంత. సినిమాలు చేసినా చేయకపోయినా తన పేరు మాత్రం ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లోనే ఉండేలా చూసుకుంటున్నారు ఈ బ్యూటీ. తాజాగా మరోసారి ట్రెండ్ అవుతున్నారు స్యామ్. మరి ఇప్పుడెందుకు ఆమె ట్రెండ్ అవుతున్నారో తెలుసా..?
Updated on: Aug 25, 2025 | 8:14 PM

సమంత తెలుగులో సినిమాలు చేయక చాలా రోజులైపోయింది.. ఈమె ఎప్పుడెప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అని వేచి చూస్తున్నారు ఫ్యాన్స్ కూడా. కానీ సరైన కథ దొరికితే గానీ మళ్లీ నటించను.. ఇప్పటికిప్పుడు పిచ్చి కథల్లో చేసే ఉద్దేశం తనకు లేదని కుండ బద్ధల కొట్టారు స్యామ్.

విజయ్ దేవరకొండ ఖుషీ తర్వాత ఈమె మళ్లీ తెలుగులో కనబడలేదు. సినిమాలు చేసినా చేయకపోయినా నిత్యం ఏదో ఓ వార్తతో న్యూస్‌లో అయితే ఉంటారు సమంత. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది.

మొన్నామధ్య నిర్మాతగా మారారు స్యామ్. ట్రలాలా ప్రొడక్షన్ మొదలుపెట్టి శుభం అంటూ సినిమా నిర్మించారు.. అది బాగానే ఆడింది కూడా.. మా ఇంటి బంగారం అంటూ త్వరలోనే మరో సినిమాతో రానున్నారు ఈ బ్యూటీ.

తెలుగులో రీ ఎంట్రీ కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నారు సమంత. కానీ సరైన స్క్రిప్ట్ రావట్లేదు.. రెమ్యునరేషన్ కోసమే సినిమాలు చేసే స్థాయి తానెప్పుడో దాటేసానని.. ఇప్పుడేదైనా సినిమా చేస్తే కనీసం ఆడియన్స్ తనని గుర్తు పెట్టుకోవాలి అంటున్నారు సమంత. ఈ క్రమంలోనే ఈమె నటిగా కాకుండా.. డైరెక్టర్‌గా మారే ఆలోచన చేస్తున్నారిప్పుడు.

కొన్నాళ్లుగా ఖాళీగానే ఉన్న సమంత.. ఈ గ్యాప్‌లో ఓ కథ సిద్ధం చేసారని తెలుస్తుంది. కొత్త వాళ్లతో సొంత నిర్మాణంలోనే సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ బ్యూటీ. అన్నీ కుదిర్తే త్వరలోనే సినిమా సెట్స్‌పైకి తెచ్చి.. 2026లో విడుదల చేయాలని చూస్తున్నారు. మరి నటిగా, నిర్మాతగా సక్సెస్ అయిన సమంత.. దర్శకురాలిగా ఏం చేస్తారనేది చూడాలి.




