- Telugu News Photo Gallery Spiritual photos Vinayaka Chavithi2025: Lalbaugcha Raja 2025 First Look See Photos Here
Vinayaka Chavithi 2025: లాల్‌బాగ్ గణపతి ఫస్ట్ లుక్ రివీల్.. భక్తులతో మండపం కళకళ..
దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. గల్లీ గల్లీ ఏర్పాటు చేసిన మండపాలలో బుజ్జి గణపయ్య వివిధ రూపాల్లో దర్శనం ఇస్తాడు. అయితే ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా గణేష్ రూపం మాత్రం గణేశోత్సవంలో ప్రధాన ఆకర్షణ. 10 రోజుల పాటు జరిగే గణపతి నవరాత్రుల పండుగ సందర్భంగా.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ముంబైలోని లాల్‌బాగ్ మండపానికి చేరుకుంటారు. అయితే ఈ ఏడాది గణపయ్య ఏ విధంగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడో ఫస్ట్ లుక్ ఆగస్టు 24 ఆదివారం నాడు బయటకు వచ్చింది.
Updated on: Aug 25, 2025 | 7:34 AM

వినాయక చవితి పండుగ జరుపుకోవడానికి ఇక కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. దీంతో బుధవారం బొజ్జ గణపయ్యని పూజించడానికి మండపాలను ఏర్పాటుని శరవేగంగా చేస్తున్నారు. డిల్లీ నుంచి గల్లీ వరకూ గణపతి విగ్రహ ప్రతిష్ట సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆగస్టు 27న గణపతి బప్పా మండపంలో కొలువుదీరి.. తొమ్మిది రాత్రులు భక్తులతో ప్రత్యేక పూజలను అందుకోనున్నాడు

అందరూ ఆసక్తిగా ఎదురు చూసే సెంట్రల్ ముంబైలోని లాల్‌బాగ్ మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన గణేశుడిని లాల్‌బాగ్చా రాజా లుక్ ని రివీల్ చేశారు. భక్తులు ఆగస్టు 24న ముంబైలోని ప్రసిద్ధ గణపతి లాల్‌బాగ్చా రాజా మొదటి దర్శనం చేసుకున్నారు.

ఏడాది పొడవునా భక్తులు లాల్‌బాగ్చా రాజాను చూడటానికి ఆసక్తిగా గంటల తరబడి క్యూలలో నిలబడి ఉంటారు. ఈ ఏడాది వినాయక మండపంలో భక్తులతో పూజలను అందుకునే గణపతి అందమైన రూపాన్ని చూడటానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం భక్తులకు తన మొదటి దర్శనం ఇచ్చాడు.

ముంబైలోని అన్ని గణపతి మండపాలలో లాల్‌బాగ్చా రాజా అత్యంత ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం వందలాది మంది భక్తులు ఇక్కడకు వస్తారు. ఈ సంవత్సరం లాల్‌బాగ్చా రాజా మొదటి దర్శనం జరిగింది. గణపతి బప్పా మనోహరమైన రూపాన్ని చూసిన తరువాత, లాల్‌బాగ్చా మండపం గణపతి బప్పా మోరియా నినాదాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది.

లాల్‌బాగ్చా రాజాను ముంబైకే కాకుండా మొత్తం దేశానికే 'రాజు' అని పిలుస్తారు. అతన్ని 'నవశాచ గణపతి' , కోరికలు తీర్చే రాజు అని కూడా పిలుస్తారు. మత విశ్వాసాల ప్రకారం ఇక్కడకు వచ్చి గణేశుడిని పూజించే వ్యక్తి కోరికలను అన్నిటిని ఖచ్చితంగా బప్పా తీరుస్తాడని నమ్మకం.

ముంబైలోని దాదర్‌లోని పరేల్ ప్రాంతంలోని లాల్‌బాగ్‌లో 1934లో లాల్‌బాగ్‌చా రాజా సర్వజనిక గణేశోత్సవ మండల్ స్థాపించబడింది. అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం మొదటిసారిగా లాల్‌బాగ్‌చా రాజా ఆస్థానం ఎత్తును 50 అడుగులు పెంచారు.

ప్రతి సంవత్సరం కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాలవారు.. గణపతిని దర్శించుకుంటారు. బాలీవుడ్ ప్రముఖుల నుంచి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల వరకు అందరూ లాల్‌బాగ్చా రాజాను సందర్శిస్తారు. ఈ సంవత్సరం లాల్‌బాగ్చా రాజా ఆస్థానానికి ఏ తారలు హాజరవుతారో చూడాలి.




