- Telugu News Photo Gallery Spiritual photos According to Chanakya, If these are adopted, married life will be happy and comfortable
చాణక్యుడు ప్రకారం.. ఇవి అలవర్చుకుంటే.. వైవాహిక జీవితం హాయి హాయిగా
ఆచార్య చాణక్యుడు అనేక విషయాల గురించి తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. అతను బహుముఖ ప్రజ్ఞాశాలి. వ్యక్తి జీవితం, నడవడి గురించి అతని అవగాహన స్థాయి భిన్నంగా ఉంటుంది. చాణక్యుడు కూడా మనుషుల మధ్య ఉండే ప్రేమ గురించి మాట్లాడాడు. సంబంధాల ప్రాముఖ్యత గురించి మాట్లాడాడు. ప్రేమ సంబంధాలలో మాధుర్యాన్ని ఎలా కొనసాగించాలో.. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఎలా గడపవచ్చో కూడా తన నీతి శాస్త్రంలో చెప్పాడు.
Updated on: Aug 24, 2025 | 7:22 PM

జీవితంలో ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర సామరస్యానికి గొప్ప ప్రాముఖ్యత ఇవ్వబడింది. దాంపత్య జీవన జీవిత సారమంతా అన్యోన్యతలో దాగి ఉంది. అందుకనే ప్రేమ, పెళ్లి విషయంలో చాలా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎటువంటి పరిస్తితులు ఏర్పడినా తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటారు.

అయితే సంబంధాలలో హెచ్చు తగ్గులు ఉంటాయి.. చిన్నా పెద్దా ఎన్నో తేడాలు ఉంటాయి. ఆచార్య చాణక్యుడు దంపతుల మధ్య బంధంలో ఎలా మధురాన్ని తీసుకురాగలరో.. వైవాహిక జీవితాన్ని ఎలా మరింత క్రమబద్ధీకరించుకోవచ్చో కూడా చెప్పాడు.

పరస్పర అవగాహన: పరస్పర అవగాహన లేకుండా జీవితంలో ఏ సంబంధమూ నిలబడదు. ప్రేమకు దాని సొంత స్థానం ఉంది. అయితే ప్రేమ కారణంగా సంబంధం ఎప్పుడూ విచ్ఛిన్నం కాదని, పరస్పర అవగాహన లేకపోవడమే సంబంధం విచ్ఛిన్నం కావడానికి అసలు కారణం. సంబంధాలలో అవగాహన లేకపోవడం వల్ల విభేదాలు తలెత్తుతాయి. ఎవరైనా సరే తమ భాగస్వామిని అర్థం చేసుకోకుండ వారిని ప్రేమించడంలో అర్థం ఏమిటి. అలాంటప్పుడు వారికి గౌరవం ఇచ్చినా.. దాని ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నించాడు. పరస్పర అవగాహన సంబంధానికి పునాది. చాణక్యుడు ప్రకారం.. ఈ విషయాన్నీ గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.

అహాన్ని వదులుకోవడం: ఇతరులను అర్థం చేసుకోని విధంగా అంటే తన సొంత నిబంధనల ప్రకారం మాత్రమే ప్రవర్తించే వ్యక్తి.. అహంభావ స్వభావం కలిగి ఉంటాడు. పనిని చెడగొట్టే వ్యక్తులు ఎల్లప్పుడూ ఇతరులను నిందిస్తూనే ఉంటారు. కనుక ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో, పురోగతిలో పయనించాలంటే అహంకారాన్ని త్యజించడం అవసరం. అప్పుడు సంబంధంలో ప్రేమను పెంచుతుంది. క్రమంగా సంబంధం కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు తము చేసే పనిలో కూడా అభివృద్ధి చెందుతాడు.

శక్తిని ఇచ్చే ప్రేమ: ఏ సంబంధానికైనా ప్రేమ అనే అనుభూతి చాలా ముఖ్యం. ప్రేమ లేకుండా ఏ బంధం నిలబడదు. ప్రేమ సంబంధంలో సానుకూల శక్తిని తెస్తుంది. నమ్మకం కూడా పెరుగుతుంది. ప్రేమ సంబంధాన్ని బలపరుస్తుంది. సంబంధాన్ని దీర్ఘకాలం కొనసాగేలా చేస్తుంది. ప్రేమ ప్రాముఖ్యత వివాహ విషయంలోనే కాదు.. ప్రతి సంబంధంలో ఉంటుంది. ఆచార్య చాణక్యుడు ప్రేమ ఒక శక్తి అంటూ తగిన ప్రాముఖ్యతనిచ్చాడు.




