Lord Shani Puja: జాతకంలో శని దోషమా..! ఏలినాటి శనా.. శనీశ్వరుడి అనుగ్రహం కోసం శనివారం ఉపవాస నియమాలు ఏమిటంటే..
నవ గ్రహాలలో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. వారంలో శనివారం న్యాయ దేవుడు శని దేవ మహారాజ్ కు అంకితం చేయబడింది. ఈ రోజున శనీశ్వరుడి అనుగ్రహం కోసం ఆయన్ని పూజిస్తారు. శనీశ్వరుడి కోసం ఉపవాసం ఉంటారు. శనివారం ఉపవాసం, నియమాలు ఏమిటో తెలుసుకోండి.

శనివారం న్యాయ దేవుడైన శనీశ్వరుడికి అంకితం చేయబడింది. కర్మ ప్రదాత అయిన శనీశ్వరుడిని శనివారం పూజిస్తారు. శని దేవుడు ప్రజలకు వారి కర్మల ప్రకారం ఫలాలను ఇస్తాడు. శనివారం శనీశ్వరుడిని పూజించడానికి ఉత్తమ రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున శనీశ్వరుడిని పూజించడం వల్ల శనీశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాదు ఏలినాటి శని, శని ధైయ్య లేదా శని దోషం బారిన పడిన వారు వాటి నుంచి ఉపశమనం పొందుతారు.
శనివారం శనీశ్వరుడి అనుగ్రహం కోసం ఉపవాసం ఉంటారు. జాతకంలో ఏలినాటి శని లేదా శని దోషంతో బాధపడుతున్నవారు శనివారం ఉపవాసం చేయడం ఫలవంతం. ఈ రోజు ఉపవాసం ఉండడం, శనీశ్వరుడికి సంబంధించిన కొన్ని పరిహారాలను చేయడం వలన ఏలినాటి శని, శని దోష ప్రభావాలను తగ్గించుకోవచ్చు. దీనితో పాటు జీవితంలో వీటి వల్ల కలిగే సమస్యలు, ఇబ్బందులను కొంతవరకు తగ్గించుకోవచ్చు.
జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటే.. దాని దుష్ప్రభావాలను తగ్గించడానికి లేదా వాటిని వదిలించుకోవడానికి శనివారం ఉపవాసం పాటించవచ్చు. శనివారం ఉపవాసం ఆచరించడానికి ఉన్న నియమాలు ఏమిటో తెలుసుకుందాం..
శనివారం ఉపవాసం, వ్రత విధి
- ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి. మీరు మొదటిసారి ఉపవాసం ఉంటే 7, 11 లేదా 21 శనివారాలు ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయడం ఫలవంతం.
- ఈ రోజున నీలం లేదా నలుపు రంగు దుస్తులు ధరించండి.
- ఈ రోజు ఉదయం రావి చెట్టును పూజించండి.
- రావి చెట్టు వేరుకి నీటిని అర్పించండి.
- సాయంత్రం శని ఆలయానికి వెళ్లి శని దేవునికి ఆవ నూనెను లేదా నువ్వుల నూనె ను సమర్పించండి.
- శని దేవుని ముందు ఆవాల నూనె దీపం వెలిగించి, ఆ దీపంలో నల్ల నువ్వులు, మినపప్పు వేయండి.
- ఈ రోజున, శని ఆలయంలో శని దేవునికి నల్లటి వస్త్రాన్ని సమర్పించండి.
- శని దేవ మంత్రాన్ని జపించండి.
- శని చాలీసా పారాయణం చేయండి.
గమనిక: ఇంట్లో పూజ గదిలో శనీశ్వరుడిని పూజించడం మంచిది కాదు. శని దేవుడి విగ్రహం లేదా చిత్ర పటాన్ని ఇంట్లో ప్రతిష్టించకూడదు. కనుక ఆయనను గుడిలో మాత్రమే పూజించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








