Poli Swargam 2023: కార్తీక మాసం చివరి రోజున పోలి స్వర్గం కథ ఎందుకు వింటారు.. బ్రాహ్మణుడికి స్వయంపాకం ఎందుకు ఇస్తారంటే..?

తెలుగులోగిళ్లలోని స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి అరటి దొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో విడిచిపెడతారు. అరటిదీపాలను వదిలిన తర్వాత  పోలి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయతీగా వస్తోంది. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా.. ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే.. మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని నమ్మకం. 

Poli Swargam 2023: కార్తీక మాసం చివరి రోజున పోలి స్వర్గం కథ ఎందుకు వింటారు.. బ్రాహ్మణుడికి స్వయంపాకం ఎందుకు ఇస్తారంటే..?
Poli Swargam Story
Follow us

|

Updated on: Dec 12, 2023 | 2:39 PM

కార్తీక మాసం ఆధ్యాత్మిక మాసం.. శివ కేశవులను అత్యంత భక్తి శ్రద్దలతో నెల రోజుల పాటు పూజించే మాసం.. నది స్నానం, దీపం, దానం  వంటి అనేక నియమ నిష్టాలకు నెలవు ఈ కార్తీక మాసం.. అయితే నెల రోజుల పాటు నది స్నానం చేసి… దీపం వెలిగించే అవకాశం లేని వారు నెలలో చివరి రోజు కార్తీక అమావాస్య రోజున నది స్నానం చేసి.. దీపాలు వెలిస్తే ఆ నెల రోజుల ఫలితం దక్కుతుందని విశ్వాసం. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ .. పోలిస్వర్గం. ఈ రోజు ఎవరు ఈ పోలి.. కార్తీక అమావాస్యకు ఆమెకు ఉన్న బంధం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో రజక స్త్రీకి ఐదుగురు కోడళ్లు ఉండేవాళ్లు. ఆ అయిదుగు కోడళ్లలో చివరిది.. చిన్నది అయిన కోడలే ‘పోలమ్మ’. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పూవులు కోయడం .. పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకూ దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. అయితే పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది. పూవులు కోయడానికి .. పూజలు చేయడానికి ..  అసలు గుడికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. కోడలి భక్తి పూజలు పోలమ్మ  అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం.

అందుకే కార్తీకమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేది మిగిలిన కోడళ్లను తీసుకుని అత్తగారు.

ఇవి కూడా చదవండి

కార్తీకమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనేలేదు. బావి దగ్గరే స్నానం చేసి ..పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి.

చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించు కుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా భక్తి శ్రద్దలతో దీపం వెలిగించిన పోలి భక్తిని చూసి దేవతలకు ముచ్చట వేసింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకు వెళ్లేందుకు విమానం దిగి వచ్చింది.

అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ.. ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసి పోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశు లయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు.

తెలుగులోగిళ్లలోని స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి అరటి దొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో విడిచిపెడతారు. అరటిదీపాలను వదిలిన తర్వాత  పోలి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయతీగా వస్తోంది. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా.. ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే.. మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని నమ్మకం.

వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీప దానం, వస్త్ర దానం, సాలగ్రామ దానం, ఉసిరి దానం, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు. తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా.. మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించు కుంటారు. అందుకే ప్రతి కార్తీక మాసం లోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ..  పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.

సేకరణ: జానపద కథలు..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

సౌత్ ఇండస్ట్రీలో పేర్లు మార్చుకున్న హీరోలు వీళ్లే..
సౌత్ ఇండస్ట్రీలో పేర్లు మార్చుకున్న హీరోలు వీళ్లే..
గబ్బిలాలు ఉండే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారా..? జాగ్రత్త..
గబ్బిలాలు ఉండే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారా..? జాగ్రత్త..
కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహం.. ప్రస్తుతం ఇలా
కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహం.. ప్రస్తుతం ఇలా
వివో నుంచి మరో కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ మాములుగా లేవు
వివో నుంచి మరో కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ మాములుగా లేవు
బోనాల పండగతో పాతబస్తీలో ఉత్సాహం
బోనాల పండగతో పాతబస్తీలో ఉత్సాహం
పిల్లిని దేవతగా పూజించే వింత ఆచారం.. శుభసూచకంగా గ్రామం నడిబొడ్డున
పిల్లిని దేవతగా పూజించే వింత ఆచారం.. శుభసూచకంగా గ్రామం నడిబొడ్డున
గోదావరి ఉగ్రరూపం.. జలదిగ్బంధంలో పలు గ్రామాలు
గోదావరి ఉగ్రరూపం.. జలదిగ్బంధంలో పలు గ్రామాలు
పురుషుల్లో ఈ లక్షణాలు.. టెస్టోస్టిరాన్‌ లోపానికి సంకేతాలు..
పురుషుల్లో ఈ లక్షణాలు.. టెస్టోస్టిరాన్‌ లోపానికి సంకేతాలు..
రోజు టీ తాగే అలవాటు ఉన్నవారు.. ఇత్తడి పాత్రలో తాగితే ఎన్ని లాభాలో
రోజు టీ తాగే అలవాటు ఉన్నవారు.. ఇత్తడి పాత్రలో తాగితే ఎన్ని లాభాలో
ఆకట్టుకుంటున్న వాట్సాప్‌ నయా అప్‌డేట్..ఇక స్టేటస్ ప్రియులకు పండగే
ఆకట్టుకుంటున్న వాట్సాప్‌ నయా అప్‌డేట్..ఇక స్టేటస్ ప్రియులకు పండగే