AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Makaravilakku: నేడే మకరజ్యోతి దర్శనం.. శబరిమలకు చేరుకున్న లక్షలాది మంది భక్తులు..

Makarajyothi Darshan: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అరుదైన ఘట్టం. అయ్యప్ప స్వాములకు అపురూప దృశ్యం. అదే మకరజ్యోతి దర్శనం. ఇవాళ(శనివారం) శబరిమలలో మకరజ్యోతి కనువిందు చేయనుంది.

Makaravilakku: నేడే మకరజ్యోతి దర్శనం.. శబరిమలకు చేరుకున్న లక్షలాది మంది భక్తులు..
Makarajyothi Darshan
Shiva Prajapati
|

Updated on: Jan 14, 2023 | 11:36 AM

Share

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అరుదైన ఘట్టం. అయ్యప్ప స్వాములకు అపురూప దృశ్యం. అదే మకరజ్యోతి దర్శనం. ఇవాళ(శనివారం) శబరిమలలో మకరజ్యోతి కనువిందు చేయనుంది. ఇప్పటికే చేరుకున్న లక్షలాది మంది అయ్యప్పస్వాముల నినాదాలతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. శబరిమలలో మరికొన్ని గంటల్లో మకరజ్యోతి కనిపించబోతుంది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇంతకీ మహోజ్వల వెలుగు ఉన్న రహస్యమేంటి? చరిత్ర ఏం చెప్తోంది? ఇంట్రస్టింగ్ వివరాలు మీకోసం..

స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాముల శరణుఘోషతో శబరిగిరులు మారుమోగుతుండగా మకరజ్యోతి రూపంలో అయ్యప్ప భక్తులకు దర్శనమిస్తారు. పొన్నాంబలమేడు కొండపై నుంచి భక్తులకు మకరజ్యోతి దివ్య దర్శనం జరగనుంది. ఈ కీలక ఘట్టం కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. లక్షల సంఖ్యలో తరలివచ్చే అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు కలగకుండా పంబానది, సన్నిధానం, హిల్‌టాప్, టోల్ ప్లాజా వద్ద జ్యోతి దర్శనాన్ని చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. వేలాది మంది భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని గస్తీ కాస్తున్నారు.

మండలకాలంపాటు దీక్ష చేసి.. ఇరుముడి కట్టుకుని శబరిమలకు చేరుకున్నారు అయ్యప్ప భక్తులు. పంబలో స్నానం చేసి.. రాళ్లదారుల్లో, అడవి మార్గంలో నడిచి సన్నిధానాన్ని చేరుకున్న స్వాములు.. శబరిగిరీశుని జ్యోతి దర్శన భాగ్యం కోసం ఎదురుచూస్తున్నారు. మకర జ్యోతి జనవరి 14 లేదా 15న మకర సంక్రాంతి నాడు వచ్చే నక్షత్రం. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు కేరళలోని శబరిమల ఆలయంలో యాత్రికులు అధిక సంఖ్యలో పూజించే నక్షత్రం. తన భక్తులను ఆశీర్వదించడానికి అయ్యప్పన్ దేవుడు తనను తాను మకర జ్యోతిగా చెప్పుకుంటాడని భక్తులు నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

సాయంత్రం తిరువాభరణాలతో పందళరాజవంశీయులు సన్నిధానం చేరుకుంటారు. శబరిమల ఆలయ ప్రధాన తంత్రి వారికి స్వాగతం పలికి..వారు తెచ్చిన బంగారు ఆభరణాలను అయ్యప్పకు అలంకరిస్తారు. అనంతరం పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతి దర్శనమిస్తుంది. మకర జ్యోతిని ముమ్మారులు తనివితీరా దర్శించి..ఇరుముడి సమర్పించి.. ఆధ్యాత్మికానందాన్ని పొందుతారు స్వాములు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..