Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti 2023: నేడు మరకరాశిలోకి సూర్యుడు.. ఈ 4 రాశులవారికి పట్టిందల్లా బంగారమే.. ఆర్థికలాభాలు, అదృష్టం వీరి సొంతం

ఈ ఏడాది జనవరి 15న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మకరరాశిలోకి సూర్యుని ప్రవేశం4 రాశుల పరిస్థితుల్లో  సానుకూలతను తెస్తుంది. అంతేకాదు వీరిపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది.

Sankranti 2023: నేడు మరకరాశిలోకి సూర్యుడు.. ఈ 4 రాశులవారికి పట్టిందల్లా బంగారమే.. ఆర్థికలాభాలు, అదృష్టం వీరి సొంతం
Sun Transit 2023
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Jan 15, 2023 | 8:15 AM

మకర సంక్రాంతి నాడు.. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారిని అదృష్టం వరిస్తుంది. కొన్ని రాశుల వారికి  కెరీర్ పరంగా మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇది వారి కుటుంబ జీవితంలో సుఖ శాంతులను కలిగిస్తాయి. ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ అదృష్ట రాశిలలో మీ రాశి కూడా ఉందా తెలుసుకోండి..

ఈ రాశుల వారికి మకర సంక్రాంతి శుభప్రదం సూర్యుడు మకరరాశిలో సంచరించినప్పుడు మకర సంక్రాంతి అంటారు. ఈ ఏడాది జనవరి 15న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత వాతావరణంలో చలి తగ్గుతుంది. వేడి పెరుగుతుంది. మకర సంక్రాంతి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా పండుగగా జరుపుకుంటారు. జ్యోతిషశాస్త్రంలో దీనిని గ్రహ సంచారంగా చూస్తారు. మకరరాశిలోకి సూర్యుని ప్రవేశం4 రాశుల పరిస్థితుల్లో  సానుకూలతను తెస్తుంది. అంతేకాదు వీరిపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది. ఆ 4 అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం-

వృషభ రాశి: ఈ రాశి వారికి సూర్య సంచారం వలన విశేషమైన మేలు కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో విశేష లాభాలు పొందుతారు.  ఈ రాశివారు ఆదాయం పెరుగుతుంది.  దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులో మీరు గెలుస్తారు. విశ్వాసం పెరుగుతుంది. తండ్రితో ఈ రాశి పిల్లల  సంబంధం కూడా మెరుగుపడుతుంది. ఈ సమయంలో.. జీవిత భాగస్వామి సలహాతో ఏదైనా పని చేస్తే.. ప్రయోజనం పొందుతారు. ఈ కాలంలో.. మతపరమైన పనులపై మీ విశ్వాసం పెరుగుతుంది. విదేశీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్నట్లయితే.. ఆ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. వీరి ధైర్యం, శక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు .. తమ సీనియర్లతో సంబంధాలు మెరుగుపరచుకుంటారు.

ఇవి కూడా చదవండి

మిథునరాశి: ఈ రాశి వారికి సూర్యుని సంచారము చాలా ప్రయోజనకరం. ఆఫీసులో మంచి వాతావరణం ఏర్పడుతుంది. ప్రజలు మీ పనిని మెచ్చుకుంటారు. వ్యాపారస్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. కొన్ని పనుల విషయంలో చాలా కాలంగా ఉన్న టెన్షన్ తొలగిపోతుంది. వైవాహిక సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ రాశిలో శని, బుధ గ్రహాలతో సూర్యుని కలయిక ఈ రాశివారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.  ఈ సమయంలో వీరు ఆర్థిక విషయాలలో ఇతరులను నమ్మే విషయంపై జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీకు దగ్గరగా ఉన్నవారు మిమ్మల్ని మోసం చేయవచ్చు.

కర్కాటక: కర్కాటక రాశి వారికి సూర్యుని సంచారం చాలా శుభప్రదం అవుతుంది. అన్ని విధాలుగా వీరికి భాగస్వామి మద్దతు లభిస్తుంది. వ్యాపార విషయాలలో.. అనేక శుభ ఫలితాలను తెస్తుంది. ఈ కాలంలో మీరు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మరోవైపు, వ్యాపారంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న చెల్లింపులు అకస్మాత్తుగా అందుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.

మకరరాశి:  మకరరాశిలో సూర్యుని సంచారము ఈ రాశి వారికి ప్రయోజనాలు తెలుస్తుంది. సానుకూలత ఏర్పడుతుంది. ఈ సమయంలో పాత సమస్యలు పరిష్కారమవుతాయి. మీ వ్యాధులు దూరమవుతాయి. ఆర్ధిక పురోగతి ఏర్పడుతుంది. వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడమే మేలు చేస్తుంది. నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది . భాగస్వామి  పూర్తి మద్దతు..  సహకారం ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)