ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే.. మహాభారతంలోని ఓ చిన్న కథ ఉదాహరణగా

Mahabharata Moral Story: మనిషి జీవితంలో రోజూ జరిగే సంఘటనలను రామాయణ, మహాభారత పురాణకథల్లో ప్రతిబింభిస్తాయి. మానవుడు ఎలా బతకాలి.. ఎలా జీవించాలో రామాయణం మనకు నేర్పితే.. అదే మనిషి ఎలా..

ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే.. మహాభారతంలోని ఓ చిన్న కథ ఉదాహరణగా
Mahabharatam
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jul 13, 2021 | 6:57 AM

Mahabharata Moral Story: మనిషి జీవితంలో రోజూ జరిగే సంఘటనలను రామాయణ, మహాభారత పురాణకథల్లో ప్రతిబింభిస్తాయి. మానవుడు ఎలా బతకాలి.. ఎలా జీవించాలో రామాయణం మనకు నేర్పితే.. అదే మనిషి ఎలా జీవించకూడదు అనే విషయంతో పాటు.. రాజకీయం.. దేశ పాలన వంటి అనేక విషయాలకు మహాభారతం దిక్చుచిగా నిలుస్తుంది అని పెద్దలు అంటారు. మహాభారతం అంటే ద్రౌపతి వస్త్రాభరణం, కురుక్షేత్రం లు ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. కానీ నిజానికి ఈరోజు దేశ రాజకీయ నేతలు అనుచరిస్తున్న ఉచితం అనే విధానాన్ని అద్దం పట్టేలా ఓ కథ ఉంది.

పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేశాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు గర్వంగా భావిస్తుండేవాడట. ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు. ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది. అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్ళు ఇచ్చింది. వారు తాగేశాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది ధర్మరాజు ఆమెతో.. ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా ? అని చెప్పడంతో.. ఆమె.. మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది. అప్పుడు ధర్మారాజు ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు.

ఇక రాజును కలవడానికి ఇద్దరు వెళ్ళారు. కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేశాడు. రాజా.. ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు. కృష్ణా… మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నది, అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం, ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు. ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు.. ఈయన రాజ్యంలో బీదవాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు..అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో… ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నారు. మహాబలరాజు చెప్పిన సమాధానంతో ధర్మరాజు తన రాజ్య స్థితిని తలసుకుని సిగ్గుపడి తల దించుకున్నాడు.

మహాభారతంలోని ఈ కథ.. ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా వివరించారు. ఈ విషయాన్నీ మరి మన పాలకులు ఎప్పుడు తెలుసుకుంటారో.. అసలు ప్రజలు ఎప్పుడు మారుతారో…అప్పుడే మనదేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుంది.

Also Read: ఈ రోజు కొంతమేర తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే ..