Gold Price Today: ఈ రోజు కొంతమేర తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే ..

Gold Price Today: గత ఏడాది కరోనా సమయంలో ఆల్ టైం హై కి వెళ్లిన బంగారం ధరల్లో అప్పటి నుంచి హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. ఆడవారు బంగారాన్ని ఆస్తిగా భావిస్తుంటే.. ముదుపరులు బంగారాన్ని..

Gold Price Today: ఈ రోజు కొంతమేర తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే ..
Gold
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jul 13, 2021 | 10:12 AM

Gold Price Today: గత ఏడాది కరోనా సమయంలో ఆల్ టైం హై కి వెళ్లిన బంగారం ధరల్లో అప్పటి నుంచి హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. ఆడవారు బంగారాన్ని ఆస్తిగా భావిస్తుంటే.. ముదుపరులు బంగారాన్ని పెట్టుబడిగా చూస్తున్న నేపథ్యంలో బంగారం ధర క్రమేపీ పెరుగుతూ వస్తుంది. అయితే ఈరోజు బులియన్ మార్కెట్ లో కొంతమేర బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ సహా తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్, విశాఖ పట్నంలో బంగారం వెండి ధరల వివరాల్లోకి వెళ్తే..

నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ 100 మేర తగ్గి.. 10 గ్రాముల బంగారం ధర ధర రూ.44,650 ఉంది.  24 క్యారెట్ల బంగారం ధర నిన్న 10 గ్రాములు ధర రూ.100 తగ్గింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.48,720 ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ , విశాఖ పట్నం, విజయవాడలో ఇవే ధరలు ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు మరోసారి క్షీణించాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ50,850 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800 వద్ద మార్కెట్ అవుతోంది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,710లు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,710 ల వద్ద మార్కెట్ కొనసాగుతుంది.

వెండి ధరల్లో రోజు రోజుకీ హెచ్చుతగ్గులున్నాయి. గత రెండు రోజులుగా పెరుగుతున్న వెండి ధర నిన్న కొంతమేర తగ్గింది. నిన్న కేజీ వెండి ధర రూ. 300 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర కేజీ వెండి ధర రూ.73,800 ఉంది. అయితే బంగారం కంటే వెండి ధర రోజు రోజుకీ పెరుగుతుంది. ముఖ్యంగా కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత పెరిగిన వెండి ధర.. మళ్ళీ దిగి రావడంలేదు..

Also Read: తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టనున్న సింగపూర్‌.. గ్రీన్‌ ఎనర్జీ, ఫార్మా, డేటా సెంటర్ల ఏర్పాటు.