Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao: తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టనున్న సింగపూర్‌.. గ్రీన్‌ ఎనర్జీ, ఫార్మా, డేటా సెంటర్ల ఏర్పాటు.

Harish Rao: సింగపూర్‌కు చెందిన పలు కార్పొరేట్‌ కంపెనీలు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. సోమవారం మంత్రి హరీష్‌ రావుతో జరిగిన సమావేశంలో సింగపూర్‌ హైకమిషనర్‌...

Harish Rao: తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టనున్న సింగపూర్‌.. గ్రీన్‌ ఎనర్జీ, ఫార్మా, డేటా సెంటర్ల ఏర్పాటు.
Harish Rao
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 13, 2021 | 6:30 AM

Harish Rao: సింగపూర్‌కు చెందిన పలు కార్పొరేట్‌ కంపెనీలు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. సోమవారం మంత్రి హరీష్‌ రావుతో జరిగిన సమావేశంలో సింగపూర్‌ హైకమిషనర్‌ హెచ్‌.ఈ. సైమన్‌ వాంగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. డేటా సెంటర్ల ఏర్పాటు, ఫార్మా, గ్రీన్‌ ఎనర్జీ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టున్నట్లు ఆయ మంత్రికి వివరించారు. వాంగ్‌ తన ప్రతినిధుల బృందంతో హరీష్‌రావును సోమవారం అరణ్య భవన్‌లో కలిశారు. ఈ భేటీ సందర్భంగా వాంగ్‌ తెలంగాణ, హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ పెట్టుబడులకు అనువైన ప్రాంతమని వెల్లడించారు. అమేజాన్‌ ఇప్పటికే హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ ఏర్పాటు చేసిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక ఫార్మా రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సకల సౌకర్యాలతో ఫార్మా సిటినీ ఏర్పాటు చేసిందని తెలిపిన మంత్రి సోలార్‌ వంటి గ్రీన్‌ ఎనర్జీలో పెట్టుబడులకు కూడా తెలంగాణ అనువైందని సింగపూర్ బృందానికి వివరించారు.

ఈ సమావేశంలో భాగంగా సింగపూర్‌ బృందాన్ని సిద్ధిపేట పట్టణాన్ని సందర్శించాలని మంత్రి హరీష్‌ కోరారు. ఇక సింగపూర్‌ ప్రతినిధులు కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను మంత్రిని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను వివరించిన మంత్రి.. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం అని, సముద్రమట్టం నుంచి వంద నుంచి 630 మీటర్ల ఎత్తులో తెలంగాణ ప్రాంతం ఉందని, గోదావరి నీటిని 630 ఎత్తు వరకు ఈ ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్‌ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Also Read: Bakrid 2021: బక్రీద్‌ను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.. మత పెద్దలతో సీపీ అంజనీ కుమార్..

Kitex Garments: కైటెక్స్ పెట్టుబడులపై కేంద్ర మంత్రి ట్వీట్.. తీవ్రంగా స్పందించిన టీకాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్..

Viral Video: అమ్మో బొమ్మ.. సడెన్‌గా చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం.. ఇదేం క్రియేటీవీటీ రా బాబూ..!