Sankashti Chaturthi: మనుషుల కష్టాలను గట్టెక్కించే నారదుడు చెప్పిన సంకష్టహర చతుర్థి స్తోత్రం..
Sankashti Chaturthi: హిందువులు తలపెట్టే పనులు నిర్విఘ్నంగా జరిగేలా చూడమని వినాయకుడిని పూజిస్తాం. అయితే మనుషుల కష్టాల నుంచి గట్టెక్కించడానికి చేసే వ్రతం సంకటహర చతుర్థి..
Sankashti Chaturthi: హిందువులు తలపెట్టే పనులు నిర్విఘ్నంగా జరిగేలా చూడమని వినాయకుడిని పూజిస్తాం. అయితే మనుషుల కష్టాల నుంచి గట్టెక్కించడానికి చేసే వ్రతం సంకటహర చతుర్థి. గణేశుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి చవితి.. ఈ చవితి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి. అయితే నారదమహర్షి చేసిన శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం సంకటహర చవితి రోజు 4 సార్లు చదవడం వలన గణపతి అనుగ్రహంతో మనం జీవితంలో సంకటాలు తొలగిపోతాయి. ఈ రోజున శ్రీ గణేష్‌ను మధ్యాహ్నం పూజిస్తారు. ఈ రోజున గణేశుడిని ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుందని భావిస్తారు. ఓం శ్రీ గణేశాయ నమః | ఓం గం గణపతయే నమః ||
శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం:
నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం, గౌరీ పుత్రం వినాయకం | భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుః కామార్ధసిద్ధయే | 1 | ప్రధమం వక్రతుండం చ,ఏకదంతం ద్వితీయకం | తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్ధకం | 2 | లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ | సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తధాష్టమం | 3 | నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకం | ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననం | 4 | ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః | న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికరం ప్రభో! | 5 | విద్యార్ధీ లభతే విద్యాం, ధనార్ధీ లభతే ధనం | పుత్రార్ధీ లభతే పుత్రాన్,మోక్షార్ధీ లభతే గతిం | 6 | జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్ | సంవత్సరేణ సిద్ధిం చ,లభతే నాత్ర సంశయః | 7 | అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ | తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః | 8 |
|| ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం ||
ఇక ఈరోజు వినాయక చతుర్థి వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఉపవాసం ఉండి.. ఉల్లి, వెల్లుల్లితో పాటు మాంసాహార ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు. ఈరోజు వ్రతమాచరించే భక్తులు పండ్లు, పాలు మొదలైన వాటితో చేసిన వస్తువులను తింటారు. అంతేకాదు ఈరోజు వారు బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంది. మద్యానికి మాంసానికి దూరంగా ఉండాలి.
ఓం గజననాయ నమః
Also Read: ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన గెయిల్