AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఏ రాశివారికి ఈరోజు ధన, వస్త్ర, వస్తు లాభాలున్నాయి.. ఏయే వస్తువులను దానం చేస్తే విశేష ఫలితాలు పొందుతారంటే

Horoscope13 July 2021: రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని...

Horoscope Today: ఏ రాశివారికి ఈరోజు ధన, వస్త్ర, వస్తు లాభాలున్నాయి.. ఏయే వస్తువులను దానం చేస్తే విశేష ఫలితాలు పొందుతారంటే
Horoscope Today
TV9 Telugu Digital Desk
| Edited By: Surya Kala|

Updated on: Jul 13, 2021 | 10:13 AM

Share

Horoscope13 July 2021: రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని.. అప్పుడు ఏమి చేయాలి అనే విషయం గురించి ఓ అంచనాకు రావాలని.. రాశిఫలాలను చూస్తుంటారు. ఈ నేపధ్యంలో జూన్ 13న రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

మేషరాశి.. ఈరోజు ఈ రాశివారు అనవసరమైన ఆందోళనలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సంబంధమైన భావనలు ఏర్పడతాయి. పేదవారికి జొన్నలు దానం ఫలితం ఉంటుంది. వృషభ రాశి.. ఈరోజు ఆర్ధిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. చేపట్టినపనుల్లో కొన్ని ఆటంకాలు ఉండవచ్చు. పేదవారికి దానం చేస్తే మేలు కలుగుతుంది. మిధున రాశి.. ఈరోజు ఈ రాశివారికి వస్త్ర, ఆభరణ పాత్రప్తి ఉంది. ఈ రాశివారు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. నేరేడు పండును దానం చేయడం మంచిది. కర్కాటక రాశి.. ఈరోజు ఈ రాశివారికి వేరు వేరు రూపాయల్లో ఫలితాలు కనిపిస్తాయి. పట్టుదలతో వ్యవహరించాలి. కుటుంబంలో వచ్చే చికాకులు దూరం చేసుకోవాలి. చిన్న పిల్లలకు తీపి పదార్ధాలు అందిస్తే మంచిది. సింహ రాశి.. ఈరోజు మంచి సౌకర్యాలుంటాయి. విద్య ఉద్యోగాల విషయంలో అనుకూలత ఉంటుంది., పేదవారికి జీడిపప్పు ను దానం చేయడం మంచిది. కన్యరాశి.. ఈ రాశివారికీ వేరు వేరుగా ఇబ్బందులు ఎదురయ్యే సందర్భాలున్నాయి. ఇతరులతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి. విష్ణు సహస్ర నామాలు మేలు చేస్తాయి. తులారాశి.. ఈరోజు వీరికి ఆర్ధిక లాభాలు ఉన్నాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. శివారాధన మేలు చేస్తుంది. వశ్చిక రాశి.. ఈ రాశివారికి అనుకున్నారు వంటి పనుల్లో విశేషమైన యోగం కనిపిస్తుంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లలిత అమ్మవారి నామ స్మరణ మేలు చేస్తుంది. ధనుస్సు రాశి.. ఈరోజు భవిష్యత్ కార్యాచరణ అనుకూలించనుంది. మేలైనటువంటి సౌకర్యాలు పొందుతారు. ఆంజనేయ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది. మకర రాశి.. ఈరోజు ఈ రాశివారు చెడు ఆలోచనలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అధిగమించుకోగలుగుతారు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. కుంభరాశి.. ఈరోజు ఈ రాశివారికి అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికమైన ఆనందాన్ని పొందగలుగుతారు. విష్ణు స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. మీన రాశి.. ఈరోజు గౌవర మర్యాదలు పెరుగుతుంటాయి. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తలు వహించాలి. శుక్రగ్రహ ఆరాధన, అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

Also Read: Sankashti Chaturthi: మనుషుల కష్టాలను గట్టెక్కించే నారదుడు చెప్పిన సంకష్టహర చతుర్థి స్తోత్రం..