Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు రొమాంటిక్ కింగ్స్.. లవ్‌లైఫ్‌లో వీరికి వీరేసాటి.!

ప్రపంచాన్ని ఏకం చేసేది ప్రేమ.. జీవితాల్లో వెలుగు నింపేది ప్రేమ.. కష్టాలను దూరం చేసేది ప్రేమ.. ఇవన్నీ సినిమా డైలాగులు కాదండోయ్..

Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు రొమాంటిక్ కింగ్స్.. లవ్‌లైఫ్‌లో వీరికి వీరేసాటి.!
Zodiac Signs
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 13, 2021 | 12:45 PM

ప్రేమ.. ఇదొక మధురానుభూతి. ప్రేమ ఎప్పుడు.? ఎలా.? ఎవరి మీద పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రపంచాన్ని ఏకం చేసేది ప్రేమ.. జీవితాల్లో వెలుగు నింపేది ప్రేమ.. కష్టాలను దూరం చేసేది ప్రేమ.. ఇవన్నీ సినిమా డైలాగులు కాదండోయ్.. ప్రేమలో ఉన్నవారు చెప్పే మాటలు. ఏది ఏమైనా ప్రేమ, ఆప్యాయత మెండుగా ఉంటే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని పెద్దలు చెబుతుంటారు.

ఇదిలా ఉంటే ప్రేమించినవాళ్లలో కొంతమంది తమ రిలేషన్‌కు కట్టుబడి ఉంటారు. తమ భాగస్వామిని గాఢంగా ప్రేమిస్తూ.. వారే సర్వస్వం అని భావిస్తారు. అలాగే మనల్ని అర్ధం చేసుకునే, ప్రేమించే భాగస్వామి దొరికితే.. లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండగలం. ఇక జోతిష్యశాస్త్రం ఆధారంగా రాశిఫలాల ద్వారా ఎవరు రొమాంటిక్‌గా ఉంటారో.? తమ బంధానికి కట్టుబడి ఉంటారో.? చెప్పవచ్చు.

ఈ నాలుగు రాశులవారు మోస్ట్ రొమాంటిక్, నిజమైన ప్రేమను విశ్వసిస్తారట…

వృషభం:

వృషభ రాశివారు పుట్టుకతోనే రొమాంటిక్. తమ భాగస్వాములు కోరుకున్న దాని కంటే ఎక్కువ ఇస్తారు. తన భాగస్వామిని ఎలప్పుడూ లవ్‌తో ముంచెత్తుతారు. ఈ రాశివారు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఏదైనా చేస్తారు. ఖరీదైన గిఫ్టుల దగ్గర నుంచి సినిమాలకు తీసుకెళ్లడం, షికారులు.. ఇలా అన్నీ కూడా తన భాగస్వామి కోసం చేస్తారు.

సింహం:

సింహ రాశివారు రొమాంటిక్ కింగ్స్ అని చెప్పవచ్చు. ఎలప్పుడూ తన భాగస్వామిని ఆశ్చర్యపరుస్తుంటారు. భారీ గిఫ్టులు, పొగడ్తలు కురిపించడం, రొమాంటిక్ డేట్స్.. ఇలా ఒకటేమిటి తన భాగస్వామితో సూపర్ అనిపించుకునేందుకు అన్ని చేస్తారు. సింహ రాశివారు మీ భాగస్వామి అయితే ఖచ్చితంగా మీకు రోజూ టైం తెలియదు.

కర్కాటకం:

రొమాన్స్‌కి నిర్వచనం ఈ రాశివారు. తమ ప్రేమకు నిబద్దతతో ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రేమను వదులుకోరు. అలాగే భాగస్వామి ఇష్టాలకు అనుగుణంగా వారిని మార్చుకుంటారు. తమ భాగస్వామి కోరికలను నెరవేర్చటానికి ఎంత శ్రమైనా పడతారు.

తుల:

ఈ రాశివారు తమ భాగస్వామి పట్ల మక్కువగా ఉంటారు. తమ సోల్‌మేట్‌ను సంతోషంగా ఉంచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తారు. తన ప్రేమను బహిర్గతం చేయకపోయినా.. భాగస్వామికి మాత్రం తెలిసేలా చేసుకుంటాడు. భాగస్వామి చివరి శ్వాస దాకా.. నిస్వార్ధమైన ప్రేమతో.. వారిని కంటికి రెప్పలా చూసుకుంటారు.

Also Read:

ఈ ఫోటోలో చిరుత నక్కింది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఏపీలో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపులు.. అన్ని జిల్లాల్లో ఒకేలా అమలు.. ఎప్పటినుంచంటే.!

10 పరుగులిచ్చి 10 వికెట్లు.. అందులో ఓ హ్యాట్రిక్.. టెస్టుల్లో అరుదైన రికార్డు.. ఆ బౌలర్ ఎవరంటే.!

కళ్లను మాయ చేసే ఫోటో.. బల్లిని గుర్తించండి చూద్దాం.. అస్సలు ఫెయిల్ కాకూడదు.!