Mantralayam: మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు.. రికార్డు స్థాయిలో రూ. 4 కోట్లకు పైగా హుండీ ఆదాయం..
కర్నూలు జిల్లా, మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం శ్రీ మఠం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వచ్చిందని శ్రీ మఠం మేనేజర్ ఎస్ కే శ్రీ నివాసరావు తెలిపారు. జనవరి నెలలో ఎక్కువగా సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారని.. దీంతో మఠానికి భారీ ఆదాయం పెరిగింది అని తెలిపారు

కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్య క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో మఠం హుండీ ఆదాయం లభించిందని పీఠాధిపతులు చెప్పారు. జనవరి నెల హుండీ ఆదాయం రూ 4 , 15 , 32 , 738. వచ్చిందని వెల్లడించారు. అంతేకాదు శ్రీ రాఘవేంద్రస్వామి మఠం హుండీ ఆదాయాన్ని చూసిన శ్రీ మఠం పీఠాధిపతులు అవక్కయ్యారు. శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయ చరిత్రలో ఇంత వరకు రాని హుండీ ఆదాయం ఇదని.. మొదటి సారిగా రికార్డు స్థాయిలో రావడంతో మఠం అధికారులు, భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం శ్రీ మఠం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వచ్చిందని శ్రీ మఠం మేనేజర్ ఎస్ కే శ్రీ నివాసరావు తెలిపారు. మంగళవారం జనవరి నెల హుండీని లెక్కించారు. హుండీ లెక్కింపు పూర్తి అయిన తర్వాత డిసెంబర్ నెలలోని మూడు రోజులను జనవరి నెలను కలుపుకుని హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు చెప్పారు. మొత్తం 33 రోజులకు రూ 4 , 15 , 32 , 738 రూపాయలు నగదు, 44 గ్రాములు బంగారం, 3642 గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్లు మఠం మేనేజర్ ఎస్ కే శ్రీ నివాసరావు తెలిపారు.
జనవరి నెలలో ఎక్కువగా సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారని.. దీంతో మఠానికి భారీ ఆదాయం పెరిగింది అని మఠం మేనేజర్ తెలిపారు. శ్రీ మఠం చరిత్రలో ఇంత భారీ మొత్తంలో ఇప్పటి వరకూ ఆదాయం రాలేదని ఇదే మొదటిసారి అని శ్రీ మఠం అధికారులు తెలిపారు…
శ్రీ రాఘవేంద్రస్వామి సమీపంలో ఉన్న 60 అడుగుల ఏకశిల శ్రీ రాముని శోభ యాత్ర సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చారు. ఈ భక్తులే శ్రీ మఠం హుండీ ఆదాయం పెరగడానికి కారణం అంటున్నారు గ్రామస్తులు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








