Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhogi 2023: భోగి పండగ అంటేనే పిల్లల పండగ.. ఈరోజున పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారో తెలుసా

ఈ భోగి పండుగనాడు సంబరమంతా పిల్లలదే. కొత్త బట్టలు ధరించి భోగి మంటల్లో భోగి పిడకలు వేయడంతో భోగి సంబరాలు మొదలవుతాయి. సాయంత్రం భోగిపండ్లు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు.

Bhogi 2023: భోగి పండగ అంటేనే పిల్లల పండగ.. ఈరోజున పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారో తెలుసా
bhogi pallu in bhogi festival
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Jan 14, 2023 | 7:00 AM

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు మొదలయాయ్యి. ఇంటింటా సందడి మొదలైంది. పిండి వంటలు గుమగుమలాడుతున్నాయి.  కోడి పందాలు డుడు, బసవన్న ఆట పాట సందడి.. ఇంటి ముంగిట రంగు రంగుల హరివిల్లులు, గోబెమ్మలు, భోగి పళ్ళు బోగి మంట హరిదాసు కీర్తనలు కొత్త అల్లుళ్లు.. కొత్త సినిమాల సందడిని తీసుకొచ్చింది.  హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండగలో ఒకటి సంక్రాంతి. ఈ సంబరాల పండగ తెలుగు వారి పెద్ద పండుగ. మూడు రోజులు జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజున వచ్చేది “భోగి” పండుగ. భోగి అంటే తొలి రోజు అని అర్ధం. ఈ రోజున ఇంటి ముందు భోగి మంటలను వేస్తారు. ఇక  ఈ భోగి పండుగనాడు సంబరమంతా పిల్లలదే. కొత్త బట్టలు ధరించి భోగి మంటల్లో భోగి పిడకలు వేయడంతో భోగి సంబరాలు మొదలవుతాయి. సాయంత్రం భోగిపండ్లు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు.

చిన్న పిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడినిగా భావిస్తూ.. భోగి రోజుసాయంత్రం పిల్లలకు భోగి పళ్ళను పోస్తారు. వాస్తవానికి భోగి పళ్లు అంటే రేగి పళ్లు.. ఈ రేగిపళ్ళను సంస్కృతంలో బదరీఫలం అంటారు. భోగిపళ్లలో చేమంతి, బంతి పువ్వుల రేకులు, అక్షింతలు, చిల్లర  నాణేలు కలిపి పిల్లల.. పిల్లలకు దిష్టి తీసి వాటిని తలపై పోస్తారు.

భోగి పళ్లు ఎందుకు పోస్తారంటే.. 

ఇవి కూడా చదవండి

భోగి అనగానే గుర్తుకు వచ్చేది భోగి పళ్ళు. చిన్న పిల్లలకు ఈ భోగి పళ్లను పోయడంలో అంతరార్ధం ఉందని పెద్దలు చెబుతారు. భోగి నాడు భోగి పళ్ళు అనే పేరుతో రేగి పండ్లను పిల్లల తల మీద పోస్తారు. రేగి చెట్టు, రేగి పండ్లు శ్రీ మన్నారాయణ స్వామి ప్రతిరూపం అని హిందువుల విశ్వాసం. భోగి రోజున ఈ పళ్లను పిల్లల తల మీద పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం తమ పిల్లల పై ఉంటుందని నమ్మకం. అంతేకాదు తమ పిల్లల మీద ఉన్న చెడు దృష్టి, దిష్టి తొలుగుతుందని విశ్వాసం. ప్రతి వ్యక్తి తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందట.. ఇలా చిన్న పిల్లల తలపై ఈ భోగి పండ్లను పోయడం వలన వారు జ్ఞానవంతులవుతారని, ఆరోగ్యంగా జీవిస్తారని పెద్దల నమ్మకం.

భోగి పళ్ళను ముందుగా తమ పిల్లలకు తల్లి పోసి ఆశీర్వదిస్తుంది. అనంతరం ఇతర సభ్యులు, స్నేహితులు భోగిపళ్లు పోసి ఆశీర్వదిస్తారు. కిందపడిన భోగి పళ్లను,డబ్బులను తీసుకోవడానికి పెద్దలు, పిల్లలు పోటీపడతారు. ఈ పళ్ళను తినడం మంచిది కాదట.. పిల్లలకు ఉన్న దిష్టి పోవాలని తీసి వేసే పళ్లు కనుక వాటిని తినటం మంచిది కాదని చెబుతారు. అందుకోసమే వాటిని తీసుకుని ఎవరూ తొక్కని ప్రదేశములో, లేదా బావిలో వేయాలని చెబుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)