AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుంభ మేళాలో దిగంబర అఖారాలకు ప్రత్యేక స్థానం.. హిందూ ధర్మ రక్షణ ధ్యేయంగా పని చేసే ఈ సంస్థ గురించి తెలుసా..

ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేలా నిర్వహణకు శర వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కుంభమేళా కార్యక్రమంలో పాల్గొనే వైష్ణవ శాఖలోని అతిపెద్ద దిగంబర అఖారా చాలా ప్రత్యేకమైనది. ఈ అఖారా మతపరమైన జెండా ఐదు రంగులలో ఉంటుంది. ఈ రోజు దిగంబర అఖారాల గురించి తెలుసుకుందాం..

కుంభ మేళాలో దిగంబర అఖారాలకు ప్రత్యేక స్థానం.. హిందూ ధర్మ రక్షణ ధ్యేయంగా పని చేసే ఈ సంస్థ గురించి తెలుసా..
Digambar Akhara In Mahakumbh Mela
Surya Kala
|

Updated on: Dec 11, 2024 | 4:19 PM

Share

2025లో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా నిర్వహించనున్నారు. ఈ మహా కుంభ మేళా జనవరి 13 ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ సమయంలో అన్ని అఖారాలలోని ఋషులు, సాధువులు మహా కుంభ మేళాలో పాల్గొని.. ఈ జాతరకు మరింత అందాన్ని పెంచుతూ కనిపిస్తారు. సాధువులు, నాగ సాధువుల అఖారాలు లేకుండా మహా కుంభ మేళా వంటి కార్యక్రమాల గురించి ప్రస్తావన అసంపూర్ణం. అనేక అఖారాలు మహా కుంభ మేళాలో పాల్గొంటారు. వీరిలో ఒకరు దిగంబర్ అఖారా. దిగంబర అఖారాలాల మూలాలు పురాతన హిందూ సంప్రదాయాలకు, ప్రత్యేకించి శివుని ఆరాధనతో ముడిపడివున్నాయి.

దిగంబర్ అఖారాలోని సాధువులు నుదిటిపై నిలువుగా ఉండే త్రిపుండ తిలకం ధరిస్తారు. మెడ చుట్టూ హారము వంటి గుత్తి, పొడవాటి తాళాలు, మందపాటి తెల్లని బట్టలు ధరిస్తారు. వైష్ణవ శాఖలోని మూడు అఖారాలలో దిగంబర అఖారా అతిపెద్దదిగా పరిగణించబడుతుంది. దిగంబర అఖారాలాకు తనదైన ప్రత్యేకత ఉంది. నిర్వాణి, నిర్మోహి అఖారాలు రెండూ దిగంబర అఖరాలకు సంబంధించినవే. ఈ రెండు అఖారాలు దిగంబర అఖారాలకు సహాయకులుగా, మత ప్రచారం కోసం ఏర్పడిన సైన్యంగా పనిచేస్తాయి. దిగంబర అఖారాలోని సాధువులు నాగులు లేదా ఏకాంతులు కాదు. ఈ అఖారాలోని సాధువులు దుస్తులు ధరిస్తారు. దిగంబర అఖారాకు చెందిన సాధువులు ప్రత్యేక వస్త్రాన్ని ధరిస్తారు. శరీరానికి ధోతిని చుట్టుకుంటారు.

ఈ సంప్రదాయానికి చెందిన రామనంది సాధువులు నిలువుగా ఉండే త్రిపుండ అంటే నుదుటిపై తిలకం ధరిస్తారు. అఖారా సెక్రటరీ నంద్రం దాస్ ప్రకారం దిగంబర అఖారా శిబిరం కుంభమేళాలో ఏర్పాటు చేయబండిందని చెప్పారు. దిగంబర అఖారాకు సంబంధించిన మతపరమైన జెండా ఐదు రంగులతో అలంకరించబడింది. ఈ జెండాపై హనుమంతుడు ఉన్నాడు. అఖారా కార్యదర్శి నంద్రం దాస్ ప్రకారం దిగంబర అఖారాకు దేశవ్యాప్తంగా 450 కంటే ఎక్కువ మఠాలు, దేవాలయాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అయోధ్యలో స్థాపించబడింది

దిగంబర అఖారా రెండవ కార్యదర్శి శ్రీ మహంత్ సత్యదేవ్ దాస్ ప్రకారం ఈ అఖారా అయోధ్యలో స్థాపించబడింది. స్థాపన సమయం స్పష్టంగా తెలియదు. అయితే ఈ సంస్థ హిందూ మతాన్ని రక్షించడానికి 500 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ప్రస్తుతం ఈ అఖారాలో రెండు లక్షల మందికి పైగా వైష్ణవ సాధువులు ఉన్నారు.

అఖారాకు చెందిన శ్రీమహంత్ మహాకుంభ మేళా సమయంలో ఎంపిక

దిగంబర అఖారాలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. ఈ అఖారాలో అత్యున్నత పదవి పేరు శ్రీ మహంత్. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా సమయంలో శ్రీ మహంత్ పదవికి ఎన్నిక జరుగుతుంది. దిగంబర అఖారాకు సంబంధించి అనేక ఉప అఖారాలు కూడా ఉన్నాయి. నంద్రం దాస్ ప్రకారం ఖాకీ అఖారా, హరివ్యాసి అఖారా, సంతోషి అఖారా, నిరవలంబి అఖారా, హరివ్యాసి నిరవలంబి అఖారా దిగంబర్ అఖారాలో భాగాలు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.