Evening Tips: సంధ్యాసమయంలో ఇంటి తలుపు వద్ద దీపం వెలిగిస్తే… లక్ష్మీదేవి కటాక్షం ఖాయం.
సనాతన ధర్మంలోని కొన్ని అద్భుతమైన నియమాల గురించి క్లుప్తంగా వివరించారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఈ ఆచారాలను నిర్వహించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
సనాతన ధర్మంలోని కొన్ని అద్భుతమైన నియమాల గురించి క్లుప్తంగా వివరించారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఈ ఆచారాలను నిర్వహించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నియమాలను పాటించడం వల్ల మానవ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సంపదలు లభిస్తాయని చాలా మంది నమ్మకం. ఈ క్రమంలో సాయంత్రం పూట ఇంటి ప్రదాన గుమ్మం వద్ద దీపం పెట్టాలని పెద్దలు చెప్పింది చాలామందికి గుర్తుంటుంది. సాయంత్రం పూట గుమ్మం దగ్గర దీపం వెలిగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సాయంత్రం పూట గుమ్మం దగ్గర దీపం పెడితే ఎలాంటి లాభం ఉంటుందో తెలుసుకుందాం.
లక్ష్మీదేవి సంతోషిస్తుంది:
ప్రతి రోజూ సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగిస్తే, లక్ష్మీ దేవి ఆశీర్వాదంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. దీంతో ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఇంట్లోని ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి.
రాహువు దుష్ప్రభావాలు తగ్గుతాయి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సంధ్యా సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద క్రమం తప్పకుండా దీపం వెలిగించే ఇంటి సభ్యుల జాతకంలో రాహువు దుష్ఫలితాలు తగ్గుతాయి. ఇంటి నుండి ప్రతికూలత తొలగిపోతుంది. సానుకూలత పెరుగుతుంది.
సానుకూల శక్తి పెరుగుతుంది:
సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద క్రమం తప్పకుండా దీపం వెలిగించే ఇంట్లో ప్రతికూల ప్రభావం ఉండదు. ఇలాంటి ఇళ్లలో పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
పేదరికం ఉండదు:
ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ దీపాలు వెలిగించే ఇంట్లో దరిద్రం ఉండదని శాస్త్రం చెబుతోంది. అటువంటి ఇళ్లలో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. కుటుంబ సభ్యుల వ్యాధుల బారిన పడరు.
శాస్త్రీయ కారణం:
శాస్త్రవేత్తల ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం వద్ద అంటే గుమ్మం వద్ద క్రమం తప్పకుండా దీపం వెలిగించడం వల్ల ఇంటి వాతావరణం శుభ్రంగా ఉంటుంది. హానికరమైన కీటకాలు, బ్యాక్టీరియా ఇంట్లోకి ప్రవేశించవని చెబుతుంటారు.
దీపం ఎక్కడ ఉంచాలి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం కుడివైపు దీపం ఉంచడం శుభప్రదంగా చెబుతోంది. ఈ దీపాన్ని నెయ్యి లేదా నూనెతో కూడా వెలిగించవచ్చు. ఈ దీపాన్ని వెలిగించడానికి ఉపయోగించే పదార్థాలపై ఎటువంటి పరిమితులు లేవు.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..