Shiva Dreams: కలలో శివుడు, శివలింగం కనిపిస్తే జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా?

మీరు శివునికి అత్యంత భక్తుడు అయితే, మీరు కనీసం ఒక్కసారైనా మీ కలలో శివుడు లేదా శివలింగాన్ని చూసి ఉంటారు. లేదంటే శివలింగాన్ని పూజించినట్లు మీకు కల వచ్చే ఉంటుంది.

Shiva Dreams: కలలో శివుడు, శివలింగం కనిపిస్తే జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా?
shiva dreams
Follow us
Madhavi

| Edited By: Narender Vaitla

Updated on: May 21, 2023 | 7:53 AM

మీరు శివునికి అత్యంత భక్తుడు అయితే, మీరు కనీసం ఒక్కసారైనా మీ కలలో శివుడు లేదా శివలింగాన్ని చూసి ఉంటారు. లేదంటే శివలింగాన్ని పూజించినట్లు మీకు కల వచ్చే ఉంటుంది. ఇటువంటి కలలు చాలా పవిత్రమైన సంయోగాలుగా పరిగణిస్తారు. కలలో శివుడిని చూడటం వలన మీ జీవితంలో పురోగతి సాధించడంతోపాటు మీ కోరికలు నెరవేరడానికి శుభసూచకగా చెబుతుంటారు. మీకు కూడా ఇలాంటి కలలు వచ్చినట్లయితే…ఆ కలల అర్థమేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి.

కలలో శివలింగాన్ని చూడటం:

మీకు కలలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా భావించాలి. మీరు మీ కలలో శివలింగాన్ని చూస్తే, మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. మీరు ఆ పనిలో విజయం సాధిస్తారని, శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని ఇది సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

కలలో శివలింగాన్ని పూజించడం:

మీరు మీ కలలో శివలింగాన్ని పూజించినట్లుగా అనిపిస్తే , మీ జీవితంలోని అన్ని రకాల అశుభాలు తొలగిపోతాయని అర్థం. అలాంటి కల మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని సూచిస్తుంది.మీరు ఇప్పటికే మీ జీవితంలో అనుభవిస్తున్న సమస్యలు సమసిపోతాయి. ఇది మంచి రోజులు రాబోతున్నాయని సూచిస్తుంది. ఈ కల కోరికల నెరవేర్పును సూచిస్తుంది.

కలలో కుటుంబ సమేతంగా శివుని పూజించడం:

మీరు మీ కుటుంబంతో కలిసి శివుడిని పూజించినట్లుగా అనిపిస్తే… మీరు మీ పనిలో అత్యంత, అంకితభావం, చిత్తశుద్ధితో నిమగ్నమై ఉన్నారనడానికి సంకేతం. అలాంటి కల ఆఫీసులో మీ కష్టాలు త్వరలో తీరుతాయని సూచిస్తుంది. ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టం తెస్తుంది. అలాంటి కల పురోగతి, ఆనందానికి చిహ్నంగా పరిగణిస్తారు.

కలలో తెల్లని శివలింగం:

మీకు కలలో తెల్లని శివలింగం కనిపిస్తే, రాబోయే కాలంలో మీరు లేదా మీ కుటుంబంలోని ఎవరైనా తీవ్రమైన అనారోగ్యం నుండి బయటపడవచ్చని స్వప్నశాస్త్రం చెబుతోంది. మీ జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందనే సంకేతంగా పరిగణించవచ్చు.

కలలో శివాలయం మెట్లు ఎక్కడం:

కలలో శివాలయం మెట్లు ఎక్కడం మీ నిజ జీవితంలో చాలా శుభ సంకేతంగా భావించాలి. మీరు మీ జీవితంలో ఆనందం, శాంతి వైపు పయనిస్తున్నారని ఈ కల అర్థం. మీరు ఇన్నాళ్లూ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిని ముగింపు పలుకుతున్నట్లు అర్థం. మీ అంచనాల ప్రకారం ప్రతిదీ జరుగుతుంది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..