Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఏపీ సర్కార్ దృష్టి.. భారీగా బడ్జెట్ కేటాయింపు
సరస్వతి నదీ పుష్కరాల సందడి అయిపోయింది. త్వరలో గోదావరి పుష్కరాలు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు గోదావరి నది ప్రవహించే ప్రతి చోటా ఈ పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అయితే గోదావరి నదికి పుష్కరాలు అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది రాజమహేంద్ర వరం.. ఈ నేపధ్యంలో ఏపీ సర్కార్ ఇప్పటి నుంచి ఏర్పాట్లపై దృష్టి సారించింది. భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్న సర్కార్ పుష్కరాల నిర్వహణకు ప్రణాలికలను రచిస్తోంది.

హిందువులు నదులను దైవంగా భావించి పుజిస్తారు. ముఖ్యంగా పుష్కారాల పేరుతో నదుల్లో స్నానమాచరించి పుజాధికార్యక్రమాలను నిర్వహిస్తారు. మన దేశంలోని 12 ప్రధాన పవిత్ర నదులకు 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలను జరుపుతారు. బృహస్పతి ఏ రాశిలో అంటే దాని ఆధారంగా ఆయా నదులకు పుష్కర వేడుకలను జరుపుతారు. దేవ గురువు బృహస్పతి సింహ రాశిలోకి ప్రవేశించే సమయంలో గోదావరినదికి పుష్కరాల పండగను జరుపుతారు. ఈ నేపధ్యంలో 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నారు. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాల కోసం ఏపీ సర్కార్ ఏర్పాట్లు మొదలు పెట్టింది.
గోదావరి పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లు
2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. గోదావరి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు గోదావరి పుష్కర ఘాట్స్ ని రెడీ చేసేందుకు భారీ బడ్జెట్ తో ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఎందుకంటే 2015 లో జరిగిన గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ రాజమండ్రిలో చోటు చేసుకున్న ఘటనలు దృష్టిలో ఉంచుకొని రానున్న పుష్కరాల కోసం రేడీ అవుతోంది. అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు.
- ఉభయ గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి అధికార యంత్రాంగం రూ.904 కోట్లతో ప్రతిపాదలు సిద్దం చేసింది.
- కేంద్రం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే రూ. 100 కోట్ల నిధులు కేటాయించింది.
- తాజాగా రైల్వే శాఖ గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్ కు రూ 271.43 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
- దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని.. ముందస్తుగానే ఆ రైళ్ల వివరాలు వెల్లడిస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది.
- అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం ఏపీలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతలో ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా వేస్తున్నారు.
- రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్, టూరిజం, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా పుష్కర ఏర్పాట్ల పైన సమీక్షను నిర్వహించారు.
- పుష్కరాల కోసం వచ్చే యాత్రికులకు బస ఏర్పాట్లతో పాటు రాజమండ్రిలో గోదావరి తీరం వద్ద మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు.
- రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు.
- కార్పొరేషన్ పరిధిలో రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లను, ఆర్‌అండ్‌బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు చేశారు.
- మొత్తంగా గోదావరి నది పుష్కర ఘాట్ల కోసం కావాల్సిన నిధుల పైన అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. నిధుల సమీకరణతో పాటుగా గోదావరి తీరప్రాంతంలో సమగ్ర అభివృద్దికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..