Garuda Purana: ఈ ఐదు అలవాట్లు వదిలిస్తే.. విజయం దానంతట అదే మీ సొంతమవుతుంది!
సనాతన ధర్మంలోని 16 పురాణాలలో ఒకటిగా గరుడ పురాణాన్ని పరిగణిస్తారు. మనిషి జన్మించిన దగ్గర నుంచి మరణం వరకు అన్నీ...

సనాతన ధర్మంలోని 16 పురాణాలలో ఒకటిగా గరుడ పురాణాన్ని పరిగణిస్తారు. మనిషి జన్మించిన దగ్గర నుంచి మరణం వరకు అన్నీ కూడా కర్మ ప్రకారం జరుగుతాయని ఇందులో వివరించి ఉంటుంది. జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి కావాల్సిన నియమాలన్నీ కూడా ఈ పురాణంలో ఉంటాయి.
స్వర్గం, నరకం, పాపం, ధర్మం, మరణం గురించి చెప్పడమే కాకుండా, జ్ఞానం, విరక్తి, త్యాగం, తపస్సు, జపం, ధర్మం, పాలన వంటి ఎన్నో విషయాలు గరుడు పురాణంలో ఉన్నాయి. ఇక ఇలాంటి ఓ ఐదు అలవాట్లు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి ఈ ఐదు అలవాట్లను వదిలిస్తే.. విజయం దానంతట అదే సొంతమవుతుంది. అవేంటో చూద్దాం..
1. కోపం
కోపం అనేది మనిషికి అతి పెద్ద శత్రువు. కోపంలో ప్రతీ వ్యక్తి అనేకసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. అనుకూలంగా జరిగే విషయాలు కూడా కొన్నిసార్లు ప్రతికూలతను తీసుకురావచ్చు. అందుకే కోపాన్ని వదిలేయమని పెద్దలు కూడా చెబుతుంటారు.
2. అసూయ
అసూయ ఒక వ్యక్తి విలువైన సమయాన్ని నాశనం చేస్తుంది. తన స్వంత విషయాలపై దృష్టి సారించడానికి బదులు.. ఇతరులను ఎలా కించపరిచాలనే ధ్యేయంగా ఆలోచిస్తాడు. అసూయ కారణంగా ఆ వ్యక్తి తన సొంత ప్రతిభను నాశనం చేసుకోవడమే కాకుండా విజయం అంచుకు కూడా చేరుకోలేడు.
3. సోమరితనం
మీరు ఎంత ప్రతిభావంతులైనప్పటికీ, సోమరితనం ఉంటే జీవితంలో ఏదీ సాధించలేరు. అందువల్ల, మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంతున్నప్పుడు తప్పనిసరిగా, సోమరితనాన్ని వదిలేయండి.
4. సంశయవాదం
మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, దాని పర్యవసానాల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత సందేహించకండి. మీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి. ఎప్పుడైతే మీ నిర్ణయంపై సందేహం ఏర్పడుతుందో.. అప్పుడే మీరు విజయానికి దూరం కావడానికి మొదటి అడుగు పడుతుంది. కాబట్టి సందేహించే అలవాటును వదిలేయండి.
5. ఆందోళన
ప్రతీ విషయానికి ఆందోళన పడవద్దు. ఏ పనినైనా మొదలుపెట్టినప్పుడు.. అది అవుతుందా.? లేదా.? అని ఖంగారు పది ఆందోళన చెందవద్దు. సరైన ఆలోచన, పక్కా ప్రణాళిక రచించండి. పనిని పూర్తి చేయండి.
