AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశులవారికి ఉద్యోగం, వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది.. ఈరోజు రాశిఫలాలు..

ఇప్పటికీ చాలా మంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటారు. అందుకోసమే రోజూ వారీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

Horoscope Today: ఈ రాశులవారికి ఉద్యోగం, వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది.. ఈరోజు రాశిఫలాలు..
Horoscope Today
Rajitha Chanti
|

Updated on: Aug 12, 2021 | 7:08 AM

Share

ఇప్పటికీ చాలా మంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటారు. అందుకోసమే రోజూ వారీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈరోజు ఆగస్ట్ 12న గురువారం సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఫలితంగా గ్రహాల స్థితి వలన ఆయా రాశుల వారి మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

మేష రాశి. ఈరోజు వీరిక ఆనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు చేసేవారు పలు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తవు. అలాగే నూతన వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. రుణాలను పొందుతారు.

మిథున రాశి.. ఈరోజు వీరికి విదేశయాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అనుకున్న పనులు జరిగి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. ఖర్చులు ఎక్కువగా జరుగుతాయి.

కర్కాటక రాశి.. ఈరోజు వీరు చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతంగా పూర్తి చేస్తారు. మానసికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఖర్చులు ఎక్కువగా చేస్తారు. అలాగే ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు.

సింహ రాశి.. ఈరోజు వీరికి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసంర. విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి.

కన్య రాశి.. ఈరోజు వీరు కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయి. రుణాలు పొందుతారు. విందులో, వినోదాల్లో పాల్గొంటారు. అనుకోకుండా ముఖ్య వ్యక్తులను కలుసుకుంటారు.

తుల రాశి.. ఈ రోజు వీరికి ధన లాభం ఉంటుంది. చేపట్టిన పనులలో విజయం పొందుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగం, వ్యాపారా రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు.

వృశ్చిక రాశి.. ఈరోజు వీరికి స్థానచలనం కలిగి అవకాశం ఉంది. పలు విషయాల్లో తలదూర్చడం వలన విమర్శలు ఎదుర్కోంటారు. నిర్ణయాలు స్థిరంగా ఉండవు. రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.

ధనుస్సు రాశి.. ఈరోజు వీరు దూర ప్రయాణాలు చేస్తుంటారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కోంటారు. మానసిక ఒత్తిడి తీవ్రమవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. దైవ దర్శనం చేస్తారు.

మకర రాశి.. ఈరోజు వీరు నూతన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు.

కుంభ రాశి.. ఈరోజు వీరు ఇంట్లో పలు మార్పులను కోరుకుంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. సన్నిహితులతో విభేదాలు ఏర్పడతాయి. పనులను వాయిదా పడతాయి.

మీన రాశి.. ఈరోజు వీరికి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కీర్తి లభిస్తుంది.

Also Read: Youtube Shorts: యూట్యూబ్ షార్ట్ వీడియోల  ద్వారా డబ్బులే డబ్బులు.. ఎలా చేయాలంటే..

Raja Raja Chora Movie: శ్రీవిష్ణు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘రాజ రాజ చోర’ వచ్చేది అప్పుడే..

Silver Price Today: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..