Youtube Shorts: యూట్యూబ్ షార్ట్ వీడియోల ద్వారా డబ్బులే డబ్బులు.. ఎలా చేయాలంటే..
Youtube Shorts: టిక్‌టాక్, మోజ్, రొపోసో వంటి షార్ట్ వీడియో యాప్స్ ఏ రేంజ్‌లో పాపులర్ అయ్యాయో మనందరికీ తెలిసిందే.
Youtube Shorts: టిక్‌టాక్, మోజ్, రొపోసో వంటి షార్ట్ వీడియో యాప్స్ ఏ రేంజ్‌లో పాపులర్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఈ యాప్స్‌కు వచ్చిన భారీ స్పందన నేపథ్యంలో అనేక యాప్స్ పుట్టుకొచ్చాయి. అయితే, వివిధ కారణాల చేత టిక్‌టాక్ వంటి పలు యాప్స్ భారత్‌లో నిషేధానికి గురయ్యాయి. అత్యంత పాపులారిటీ కలిగిన టిక్‌టాక్ యాప్‌ను నిషేధించడంతో.. దేశంలో దాని స్థానాన్ని భర్తీ చేసేందుకు చాలా యాప్స్ వచ్చాయి. అయితే, ఏది కూడా టిక్‌టాక్ మాదిరిగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, టిక్‌టాక్ మాదిరిగానే.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ రీల్స్ తీసుకువచ్చింది. ఈ రీల్స్‌కు విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ కూడా షార్ట్స్ వీడియోను తీసుకువచ్చింది. ఇది కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఈ షార్ట్స్ చూడటానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు యూట్యూబ్ మీకు అవసరమైన సమాచారాన్ని, వినోదాన్ని పొందడానికి మార్గంగా ఉంది. కానీ, ఇప్పుడు సులువగా సంపాదించుకోవడానికి కూడా మార్గం చూపుతోంది. అవును.. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్‌కి మరింత డబ్బు సంపాదించడానికి అవకాశం ఇస్తోంది. దీని కోసం యూట్యూబ్ 2021-22 సంవత్సరానికి 100 మిలియన్ల ఫండ్‌ను విడుదల చేశారు. ఇంతకీ షార్ట్ వీడియోలు అంటే ఏంటి? ఎలా చేయాలి? మనీ ఎలా వస్తుంది?..
షార్ట్ వీడియోలు అంటే ఏంటి..? చిన్న వీడియో అంటే.. 1 నిమిషం కంటే తక్కువ వ్యవధి ఉన్న వీడియోలు. ఇంతకు ముందు భారతదేశంలో చిన్న వీడియోల కోసం టిక్‌టాక్ యాప్ ఉండేది. కానీ ఆ యాప్‌ని నిషేధించారు. ఆ తరువాత.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ లఘు చిత్రాలు దాని స్థానాన్ని ఆక్రమించాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లలో 60 సెకన్ల వరకు ఉన్న వీడియోలను పబ్లిష్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఈ వీడియో తప్పనిసరిగా 9/16 ఫార్మాట్‌లో ఉండాలి.
ఈ వీడియోను ఎలా చేయాలి? యూట్యూబ్ షార్ట్ వీడియోలను చేయడానికి ముందుగా యూట్యూబ్ అప్లికేషన్‌లో కింద చూపిన ప్లస్ సింబల్(క్రియేట్ బటన్)పై క్లిక్ చేయాలి. ఆ తరువాత వీడియోలను కూడా అప్‌లోడ్ చేయవచ్చు. అయితే, ఈ ప్లస్ గుర్తుపై క్లిక్ చేసిన తరువాత.. అనేక ఆప్షన్స్ కనిపిస్తాయి. మ్యూజిక్, ఎఫెక్ట్స్‌ని యాడ్ చేయొచ్చు. మొత్తం సెట్ చేసుకున్న తరువాత టైటిల్, ఇతర సమాచారంతో వీడియోను అప్‌లోడ్ చేయాలి.
డబ్బు ఎలా వస్తుంది? యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ద్వారా డబ్బు సంపాదించడానికి మీరు కొంత ప్రాసెస్‌ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ముందుగా మోనటైజేషన్ ప్రమాణాలను పూర్తి చేయాలి. ఇది మీ ఇష్టాలు, సెలక్షన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఇక మీరు పబ్లిష్ చేసిన వీడియోకు వ్యూస్ అధికంగా వస్తే.. దాని ఆధారంగా యూట్యూబ్ డబ్బులు చెల్లిస్తుంది.
Also read:
Raja Raja Chora Movie: శ్రీవిష్ణు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘రాజ రాజ చోర’ వచ్చేది అప్పుడే..
Silver Price Today: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..
Toothache Home Remedies: పంటినొప్పి వచ్చినప్పుడు ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.. ఉపశమనం పొందండి