AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poison Expiry Date: విషానికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా?.. ఆసక్తికర విషయాలు మీకోసం..

Poison Expiry Date: మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఇంట్లోకి అవసరమైన ఆహార పదార్థాలు తీసుకువస్తారు. అయితే, వాటిని తీసుకువచ్చే ముందు ఖచ్చితంగా

Poison Expiry Date: విషానికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా?.. ఆసక్తికర విషయాలు మీకోసం..
Poison
Shiva Prajapati
|

Updated on: Aug 12, 2021 | 5:57 AM

Share

Poison Expiry Date: మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఇంట్లోకి అవసరమైన ఆహార పదార్థాలు తీసుకువస్తారు. అయితే, వాటిని తీసుకువచ్చే ముందు ఖచ్చితంగా దాని ఎక్స్‌పైరీ డేట్‌ను చెక్ చేసి మరీ తీసుకుంటారు. ఇక అనారోగ్యానికి గురైనప్పుడు.. తీసుకునే ఔషధాలను సైతం ఎక్స్‌పైరీ డేట్ చూసే తీసుకుంటాం. ఒకవేళ ఎక్స్‌పైరీ డేట్ కంప్లీట్ అయిన ఔషధాలను ఫార్మసీ కంపెనీలు విక్రయిస్తున్నట్లయితే.. వాటిపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు కఠిన చర్యలు తీసుకుంటారు. ఇక సబ్బులు, షాంపోలు వంటి కాస్మోటిక్స్.. ఇతర ప్రతీ వస్తువును ఎక్స్‌పైరీ డేట్ చూసిన తరువాతే తీసుకుంటారు. ఒకవేళ గడువు తేదీ ముగిసినట్లయితే.. దాని దుష్ప్రభావాలు మన శరీరంపై చూపే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది. అందుకే.. ఎక్స్‌పైరీ డేట్‌కు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు.

అయితే, మనిషిని చంపే విషానికి ఎక్స్‌పైరీ డేట్ ఉందా? ఉంటే దాని ప్రభావం ఎంటి? ఎలా పనిచేస్తుంది? గడువు ముగిసిన పాయిజన్.. ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఎక్స్‌పైరీ డేట్ పూర్తయిన పాయిజన్ మరింత విషపూరితంగా మారుతుందా? ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మందుల మాదిరిగానే..  ఔషధం, విషం.. ఈ రెండింటినీ తయారు చేయడానికి ప్రత్యేక నమూనాను పాటిస్తారు తయారీదారులు. అనేక రకాల మూలకాలు, రసాయనాలను కలపడం ద్వారా మందులు తయారు చేయడం జరుగుతుంది. అదే విధంగా, విషాన్ని కూడా అనేక రకాల రసాయనాలు, ఇతర పదార్థాలు మిక్స్ చేసి తయారు చేస్తారు. అందుకే ఔషధాల మాదిరిగానే.. వివిధ రకాల విష పదార్థాలు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. వీటిని వివిధ రకాల ప్రయోజనాల కోసం వినియోగిస్తుంటారు.

మార్కెట్లో లభించే ఎలుకల నివారణి మందు గురించి చూసుకున్నట్లయితే.. ఇది ఒక విషపదార్థాం. ఎలుకలు దీనిని తింటే అవి స్పాట్‌లోనే చనిపోతాయి. అలాగే మనుషులు తిన్నా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా కంపెనీలు ఎలుక నివారణికి సంబంధించి ప్రకటనలు ఇస్తుంటాయి. ‘ఎలుకలు తింటాయి.. బయటకు చనిపోతాయి’ అని టీవీల్లో యాడ్స్ వస్తుంటాయి. అంటే, ఆ ఎలుక కేక్ తిన్న తర్వాత అస్వస్థతకు గురవుతాయి. అవి వెంటనే బహిరంగ ప్రదేశంలోకి రావాలనుకుంటాయి. దాంతో అవి బయటకు పరుగులు తీస్తాయి. అలా అవి ఇంట్లో కాకుండా బయటకు వచ్చి ప్రాణాలు కోల్పోతాయని అర్థం.

విషానికీ ఎక్స్‌పైరీ డేట్..? విషం కూడా ఒక రకమైన రసాయన సమీకరణం. అందుకే, ఔషధాల మాదిరిగానే.. దీనికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విషం ఎక్స్‌పైరీ డేట్ అది ఏ రసాయనాలతో తయారు చేయబడిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. వివిధ రసాయనాలతో విషాన్ని తయరు చేస్తారని ముందే చెప్పుకున్నాం. దాని ప్రకారం.. విషంలోని ఏదైనా రసాయనం నిర్ధిష్ట సమయం తరువాత నిష్క్రియంగా మారితే.. దాని ప్రభావం విషంపై కూడా చూపుతుంది. అంటే.. విషం ప్రభావం కూడా కొంతకాలమే ఉంటుంది.

ఎక్స్‌పైరీ డేట్ ముగిసినా విషం ప్రభావం ఉంటుందా? సాధారణంగా గడువు ముగిసిన ఔషధాలు, పదార్థాలు వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. అయితే విషం కూడా అలా పనిచేస్తుందా? ఎక్స్‌పైరీ డేట్‌ ముగియడంతో దాని ప్రభావం కూడా ముగిసిపోతుందా? లేక గడువు ముగిసిన విషం.. మునుపటి కంటే ఎక్కువ విషపూరితంగా మారుతుందా? అనే సందేహాలు చాలానే ఉన్నాయి. అయితే, గడువు ముగిసిన విషం.. మునపటిలా ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు. అని పనిచేయకపోవచ్చని చెబుతున్నారు. అయితే, ప్రభావం తగ్గుతుందా? మరింత విషపూరితం అవుతుందా? అనేది అది తయారు చేసిన రసాయనాల మీద కూడా ఆధారపడి ఉంటుందట. దాదాపుగా అయితే, గడువు ముగిసిన తరువాత విషం ప్రభావం అంతగా ఉండదని చెబుతున్నారు.

Also read:

Rich Village: దక్షిణాసియాలోనే అత్యంత ధనిక గ్రామం.. వారి ఆస్తుల వివరాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..!

Andhra Pradesh: నాలుగేళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయిన భర్త.. విగ్రహానికి నిత్యం పూజలు చేస్తున్న మహిళ..

Hyderabad City: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. చదువు నేర్పుతారని పిల్లలను పంపిస్తే..