Rich Village: దక్షిణాసియాలోనే అత్యంత ధనిక గ్రామం.. వారి ఆస్తుల వివరాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..!

Rich Village: భారతదేశంలో అనేక గ్రామాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని గ్రామాలు చాలా స్పెషల్. ఆ స్పెషల్స్ కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంతరించుకున్నాయి.

Rich Village: దక్షిణాసియాలోనే అత్యంత ధనిక గ్రామం.. వారి ఆస్తుల వివరాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..!
Money
Follow us

|

Updated on: Aug 12, 2021 | 5:40 AM

Rich Village: భారతదేశంలో అనేక గ్రామాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని గ్రామాలు చాలా స్పెషల్. ఆ స్పెషల్స్ కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంతరించుకున్నాయి. కొన్ని గ్రామాలు పరిశుభ్రతకు ప్రసిద్ధి చెందితే.. మరికొన్ని గ్రామాలు మల్లయోధులకు నిలయంగా ప్రసిద్ధిగాంచాయి. ఇంకొన్ని గ్రామాలు నేర రహితంగానూ, కరోనా రహితంగానూ గుర్తింపు పొందాయి. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే గ్రామం మాత్రం చాలా స్పెషల్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ఎప్పుడూ వినని, కనని గ్రామం గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఆ గ్రామం పేరు మాదాపర్. ఈ గ్రామం భారత్‌లోనే కాదు.. ఏకంగా దక్షిణాసియాలోనే అత్యంత సంపన్నమైన గ్రామంగా గుర్తింపు పొందింది. ఇదొక్కటే కాదు.. అనేక అంశాల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో గల మాదాపర్ గ్రామంలో 7,600 ఇళ్లు ఉన్నాయి. ఈ గ్రామంలో ఉన్న సౌకర్యాలను చూస్తే కచ్చితంగా ఫ్యూజ్‌లు ఎగిరిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

బ్యాంక్, పోస్టాఫీసుల్లో రూ. 5200 కోట్ల డిపాజిట్లు.. మాదాపర్ గ్రామ జనాభాలో సగానికి పైగా విదేశాలలో స్థిరపడ్డారు. ఈ గ్రామానికి చెందిన చాలా మంది అత్యధిక భాగం లండన్‌లో స్థిరపడగా.. ఇంకొందరు అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా వంటి ఇతర దేశాలలో స్థిరపడ్డారు. ఈ గ్రామంలోని ప్రతి ఇంటి నుండి కనీసం ఇద్దరు వ్యక్తులు విదేశాలలో నివసించడం విశేషం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. చాలా మండలాల్లోనే బ్యాంకులు, పోస్టాఫీస్ సేవలు అందుబాటులో లేని పరిస్థితి ఉండగా.. ఈ గ్రామంలో ఏకంగా 17 బ్యాంకుల బ్రాంచ్‌లు ఉన్నాయి. మరి ఈ బ్యాంకుల్లో ఆ గ్రామస్తుల డిపాజిట్లు ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 5000 కోట్లు. ఇది కాకుండా గ్రామంలో ఉన్న పోస్టాఫీసులో దాదాపు రూ. 200 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. అందుకే ఈ గ్రామ భారతదేశంలోనే కాదు.. దక్షిణాసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా గుర్తింపు పొందింది.

ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు.. ఆర్థికంగా బలంగా ఉండి.. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ, మాదాపర్ ప్రజలు తమ గ్రామీణ ఆహార్యాన్ని మాత్రం మార్చుకోలేదు. గ్రామంలో నివసించే వారిలో చాలా మంది తమ పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామంలోని వ్యక్తులు ఎవరూ తమ పొలాలను విక్రయించలేదు. 1968 లో, లండన్‌లో స్థిరపడిన ప్రజలు అక్కడ మాదాపర్ విలేజ్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. లండన్‌లో నివసిస్తున్న మాదాపర్ ప్రజలు ఎప్పటికప్పుడు విభిన్న కార్యక్రమాలతో ఒకరినొకరు కలుసుకోవాలనేది ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం. ఇక ఈ గ్రామంలో ఒక మాల్ కూడా ఉంది. అంతేకాదు.. ప్రపంచంలోని అన్ని పెద్ద, ప్రసిద్ధ బ్రాండ్ల స్టోర్‌లు కూడా ఉన్నాయి. ఇక మాదాపర్ గ్రామంలో ప్లే స్కూల్ నుండి కళాశాల వరకు ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, ఈ కచ్ గ్రామంలో అత్యాధునిక ఆరోగ్య కేంద్రం, పెద్ద కమ్యూనిటీ సెంటర్ కూడా ఉన్నాయి.

Also read:

Andhra Pradesh: నాలుగేళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయిన భర్త.. విగ్రహానికి నిత్యం పూజలు చేస్తున్న మహిళ..

Hyderabad City: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. చదువు నేర్పుతారని పిల్లలను పంపిస్తే..

Telangana Collectors: తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు.. హైదరాబాద్ కలెక్టర్‌గా ఎల్. శర్మన్..

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..