Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ ఐదు రాశులవారు భోజనప్రియులు.. వారికి వారే సాటి! అందులో మీరున్నారా.?

ఆహారం విషయంలో ప్రతీ ఒక్కరి అభిరుచి భిన్నంగా ఉంటుంది. కొంతమంది మిర్చి బజ్జీలు అంటే ఇష్టం.. మరికొందరికి జిలేబీలు..

Zodiac Signs: ఈ ఐదు రాశులవారు భోజనప్రియులు.. వారికి వారే సాటి! అందులో మీరున్నారా.?
Zodiacs 1
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 11, 2021 | 2:35 PM

ఆహారం విషయంలో ప్రతీ ఒక్కరి అభిరుచి భిన్నంగా ఉంటుంది. కొంతమంది మిర్చి బజ్జీలు అంటే ఇష్టం.. మరికొందరికి జిలేబీలు అంటే ఇష్టం.. ఇంకొందరికి పానీపూరి అంటే ఇష్టం.. ఇలా ఎవరి టేస్ట్ వారిది. ఆహారం పట్ల ఇష్టం అనేది ఒక ఎత్తయితే.. ప్రేమ ఉండటం మరో ఎత్తు.. భోజనప్రియులను మనం చూస్తూనే ఉంటాం. మన ఫ్రెండ్స్‌లో కూడా కొందరు ఉంటారు. ఎన్ని అవాంతరాలు ముంచుకొచ్చినా.. ముందు ఫుడ్ అంటూ ఇష్టంగా లాగిస్తుంటారు. వారికి తిండి అంటే అంత ఇష్టం మరి. అయితే ఆహారాన్ని అమితంగా ఇష్టపడటం మీ వ్యక్తిత్వంలో ఓ భాగమని మీకు తెలుసా.? అసలు దానికి రాశులకు మధ్య సంబంధం ఏంటి.? జోతిష్యం ప్రకారం ఈ రాశులవారు ఎక్కువ భోజనప్రియులు అని పండితులు అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

వృషభం

వృషభ రాశివారు భోజనాన్ని అమితంగా ఇష్టపడతారు. చూడటానికి బాగుందా.? రుచి ఎలా ఉంది.? అన్నది చెబుతారు. కొత్త వంటకాలను ట్రై చేయడంలో.. కొత్త ఆహారపు అలవాట్లను అలవరుచుకోవడంలో ముందుంటారు.

తులారాశి

తులారాశి ప్రజలు అల్పాహారాలను ఎక్కువగా ఇష్టపడతారు. అర్ధరాత్రి కూడా టిఫిన్ చేయడాన్ని ఇష్టపడతారు.

మీనం

మీనరాశివారు తమను ఆహ్లాదపరిచే ఆహారాన్ని తీసుకుంటారు. వీరు భోజనప్రియులు. తాము ఏమి తినాలనుకుంటున్నారో ఆ ఆహారాలకు సంబంధించి పెద్ద లిస్టును ప్రిపేర్ చేసుకుంటారు. కొత్త రకాల వంటకాలను ప్రయత్నించడంలో ముందుంటారు. ఎక్కువగా జంక్, స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టపడతారు.

సింహరాశి

సింహరాశివారు తిండిప్రియులు, ఖరీదైన ఫుడ్స్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తారు. జంక్ ఫుడ్స్ లాంటివి తినరు. ఏ ఫుడ్ తిన్నా.. దాన్ని ఆస్వాదిస్తూ తినడం వీరి అలవాటు. పరిసరాలు చక్కగా, శుభ్రంగా ఉండే చోట ఆహారాన్ని తినడం ఇష్టపడతారు.

మేషం

మేషరాశివారి ఆహారంతో ప్రయోగాలు చేస్తుండటం వారికి ఇష్టం. వివిధ రకాల ఆహారాలను ట్రై చేస్తారు. వాటిని తినడానికి ఇష్టపడతారు. ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారాన్ని తినడం వారికి నచ్చదు.

Also Read:

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!

ఈ ఫోటోలో చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

8 పరుగులకే నాలుగు వికెట్లు.. ఆరుగురు బ్యాట్స్‌మెన్లు ఖాతానే తెరవలేదు.. టీమిండియా వరస్ట్ రికార్డు