Friday Puja Tips: వివాహం ఆలస్యం అవుతుందా.. 16 శుక్ర వారాలు సంతోషిమాత వ్రతం చేయండి..
శుక్రవారం రోజున సంతోషిమాత అనుగ్రహం కోసం ఆశీర్వాదం కోసం చేసే పూజ, ఉపవాసం ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున సంతోషిమాతతో పాటు లక్ష్మీ దేవికి కూడా ఉపవాసం చేయడం ద్వారా పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. సంతోషిమాతకు రాకుండా ఉండాలంటే శుక్రవారం పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. అవి ఏమిటో తెలుసుకుందాం..
హిందువులు శుక్రవారం లక్ష్మీదేవి, సంతోషిమాతను పూజిస్తారు. విఘ్నలకధిపతి గణపతి సిద్ధి, బుద్ధిల కుమార్తె సంతోషిమాత అని పరిగణించబడుతుంది. ఎవరైనా సంతోషిమాతను నిజమైన భక్తి శ్రద్దలతో పూజిస్తే.. వారిపై అమ్మవారు విశేషమైన అనుగ్రహాలను కురిపిస్తుంది. శుక్రవారం రోజున సంతోషిమాత అనుగ్రహం కోసం ఆశీర్వాదం కోసం చేసే పూజ, ఉపవాసం ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున సంతోషిమాతతో పాటు లక్ష్మీ దేవికి కూడా ఉపవాసం చేయడం ద్వారా పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. సంతోషిమాతకు రాకుండా ఉండాలంటే శుక్రవారం పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. అవి ఏమిటో తెలుసుకుందాం..
సంతోషి మాత పూజ, ఉపవాసంలో పొరపాటున కూడా చేయకూడని పనులు
సంతోషి మాత అనుగ్రహం కోసం చేసే వ్రతంలో శుక్రవారం రోజున పులుపు తినకూడదు. ఈ వ్రత దీక్ష సమయంలో పుల్లని ఆహారం తీసుకోవడం నిషిద్ధం. సంతోషి మాతకు పులుపు అంటే అస్సలు ఇష్టం ఉండదని.. కనుక ఈ రోజున ఉపవాసం ఉండే ఏ భక్తుడైనా పొరపాటున అయినా పులుపు తింటే ఆ మాత ఆగ్రహానికి గురికావలసి వస్తుందని నమ్ముతారు. పులుపుని తినడం వలన తల్లికి కోపం వస్తుంది. వ్రతం వలన కలిగే శుభ ఫలానికి బదులుగా.. అమ్మవారి ఆగ్రహంతో చెడును భరించాల్సి వస్తుంది. ఈ వ్రతంలో ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం మొదలైన తామసిక ఆహార వస్తువులు కూడా ముట్టుకోకూడదు. శుక్రవారం ఎవరితోనూ తప్పుగా మాట్లాడకూడదు.. ఎవరికీ చెడు చేయకూడదు.. ఎవరి గురించి తప్పుగా ఆలోచించకూడదు.
ఉపవాసాన్ని చేయాల్సిన పద్దతి ఏమిటంటే? శుక్రవారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేచి ముందుగా తలస్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఇంటిని, పూజగదిని శుభ్రం చేసిన తర్వాత ఎర్రటి వస్త్రంపై అమ్మవారి చిత్రపటాన్ని ప్రతిష్టించి, కొబ్బరికాయతో కలశాన్ని ప్రతిష్టించండి. అమ్మవారి పూజలో బెల్లం, శనగలు నైవేద్యానికి విశేష ప్రాధాన్యత ఉంది. దీపం, పూలు, పులుపు లేని పండ్లతో పూజను చేయండి. అక్షతలు, కుంకుమ, పానకం, వడపప్పు ని అమ్మవారికి సమర్పించి ఆపై హారతిని ఇవ్వండి. శుక్రవారం ఉపవాసం ఉండి.. అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని స్నేహితులకు, బంధువులకు పంపిణీ చేయండి.
అయితే ఈ ప్రసాదాన్ని శుక్రవారం రోజు పులుపు తినని వారికి మాత్రమే పంపిణీ చేయాలి. రోజంతా సంతోషి మాతను ధ్యానిస్తూ ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించిన తర్వాత భోజనం చేయండి, పొరపాటున కూడా పులుపు తినకండి. అంతేకాదు ఈ రోజు పేదలకు దానం చేయడం వలన శుభఫలితం ఉంటుందని విశ్వాసం
ఉపవాస ప్రాముఖ్యత ఏమిటి? సంతోషి మాతను పూజించడం వలన జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. డబ్బుకు లోటు ఉండదు. అంతేకాదు పెళ్లికాని యువతులకు పెళ్లి జరుగుతుంది. పెళ్లికాని అమ్మాయిలు 16 శుక్రవారాలు సంతోషిమాత అనుగ్రహం కోసం వ్రతం చేసి ఉపవాసం ఉండి.. ఉజ్జపన చేస్తే.. ఆ యువతి వివాహం త్వరలో జరుగుతుందని విశ్వాసం. మరోవైపు వివాహిత స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే నిండునూరేళ్ళు భర్తతో పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).