Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guru Purnima: గురు పౌర్ణమిన గురువుని పూజించే సంప్రదాయం.. పూజ, దానాలు ఏమిటంటే

సనాతన సంప్రదాయంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పవిత్రమైన తేదీని వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అని కూడా అంటారు. ఆషాఢమాసంలో పూర్ణమి రోజున శుభఫలితాలను పొందడానికి ప్రత్యేకంగా పూజలు, జపం, తపస్సు, దానం మొదలైనవి చేస్తారు.

Guru Purnima: గురు పౌర్ణమిన గురువుని పూజించే సంప్రదాయం.. పూజ, దానాలు ఏమిటంటే
Guru Purnima 2023
Follow us
Surya Kala

|

Updated on: Jun 30, 2023 | 8:14 AM

సనాతన హిందూ సంప్రదాయంలో తెలుగు నెలల్లో నాలుగో మాసం అయిన ఆషాఢ మాసం చాలా పవిత్రమైనది. ఆషాడంలో చేసే పూజ, పారాయణ, తపస్సుకు ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ నాల్గవ నెలలో దుర్గామాత, శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి, ఇంద్ర దేవతలను పూజించే ఆచారం ఉంది. ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అని, వ్యాస పూర్ణమి అని అంటారు. ఈ రోజున శ్రీ హరిని, వ్యాస భగవానుడిని గురువుని పూజించే సాంప్రదాయం ఉంది. ఈ ఏడాది గురు పౌర్ణమి జూలై 3వ తేదీన వచ్చింది.

శ్రీ హరితో పాటు గురువును పూజించండి సనాతన సంప్రదాయంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పవిత్రమైన తేదీని వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అని కూడా అంటారు. ఆషాఢమాసంలో పూర్ణమి రోజున శుభఫలితాలను పొందడానికి ప్రత్యేకంగా పూజలు, జపం, తపస్సు, దానం మొదలైనవి చేస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం పూర్ణిమ రోజున శ్రీ విష్ణువు, సంపదల దేవత లక్ష్మీదేవిని, గురువుని పూజించడం వల్ల చాలా పుణ్యం లభిస్తుంది.

చంద్రుడిని పూజించే సంప్రదాయం  అటువంటి పరిస్థితిలో గురు పూర్ణమి రోజున నియమాలు, నిబంధనల ప్రకారం గురువుని, చంద్రుడిని,  పూజించాలి. తద్వారా వారి ఆశీర్వాదాలు ఏడాది పొడవునా లభిస్తాయని విశ్వాసం. రాత్రి వేళ చంద్రుడిని దర్శించిన అనంతరం చంద్రుడికి పాలు, నీటితో అర్ఘ్యం ఇవ్వాలి. ఈ పూజా పద్ధతిని ఆచరించడం ద్వారా  సాధకుడు అన్ని రకాల మానసిక చింతల నుండి విముక్తి పొందుతాడని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

ఆషాఢ పూర్ణిమ రోజున దానం చేయాల్సిన వస్తువులు..   హిందూ విశ్వాసం ప్రకారం పౌర్ణమి రోజున చేసే పూజలకు మాత్రమే కాదు.. సేవ, దానం వలన కూడా దేవతల అనుగ్రహం ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వాసం. అటువంటి పరిస్థితిలో ఆషాఢ మాసం ముగిసేలోపు  అమ్మవారి అనుగ్రహం కోసం ఆహారం, బట్టలు, డబ్బు మొదలైనవాటిని దానం చేయాలి. ఆర్ధిక ఇబందులు ఎదురైతే బియ్యం పాయసం చేసి పేద ప్రజలకు  పౌర్ణమి రోజున పంచాలి. ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కురుస్తుందని, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).