Kaal Sarp Dosh: మీ జాతకంలో కాల సర్ప దోషం ఉందా.. నివారణకు ఈ ఆలయంలో పూజ అత్యంత ఫలవంతం..

సనాతన సంప్రదాయం ప్రకారం.. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబకేశ్వర ఆలయం కాల సర్ప దోషాన్ని తొలగించే ప్రసిద్ధ ప్రదేశం. హిందూ విశ్వాసం ప్రకారం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ నాగపంచమి లేదా ఇతర ప్రత్యేక పర్వదినాల సమయంలో కాల సర్ప దోష నివారణ కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.

Kaal Sarp Dosh: మీ జాతకంలో కాల సర్ప దోషం ఉందా.. నివారణకు ఈ ఆలయంలో పూజ అత్యంత ఫలవంతం..
Trayambakeshwar Temple
Follow us

|

Updated on: Jun 27, 2023 | 7:24 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో నైనా కాల సర్ప దోషం ఉంటె అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అంతేకాదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ధన సంపాదన విషయంలో అడుగు ముందుకు పడదు. ఆర్ధిక నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాల సర్ప దోషం వల్ల మనిషి జీవితంలో అనేక రకాల సమస్యలు కలుగుతాయి. చేస్తున్న పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. అయితే జాతకంలో ఉన్న ఈ కాల సర్ప దోషాన్ని తొలగించే పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. నియమ నిబంధనల ప్రకారం ఆ దేవాలయంలో పూజలు చేయడం వలన కాలసర్ప దోషం తొలగి సుఖ శాంతులు నెలకొంటాయి.

సనాతన సంప్రదాయం ప్రకారం.. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబకేశ్వర ఆలయం కాల సర్ప దోషాన్ని తొలగించే ప్రసిద్ధ ప్రదేశం. హిందూ విశ్వాసం ప్రకారం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ నాగపంచమి లేదా ఇతర ప్రత్యేక పర్వదినాల సమయంలో కాల సర్ప దోష నివారణ కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.

సనాతన ధర్మం ప్రకారం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం కాల సర్ప దోష నివారణకు చాలా ప్రసిద్ధి చెందింది.  కాల దోషం నుండి బయటపడటానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు ఈ ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్ర జ్యోతిర్లింగ దర్శనం ద్వారా కాల సర్ప దోషం నుండి విముక్తి పొందుతారని కూడా ఒక నమ్మకం. అందుకనే కాలసర్ప దోషం నుండి విముక్తి పొందేందుకు దేశ, విదేశాల నుండి భారీ సంఖ్యలో భక్తులు శివుని పవిత్ర క్షేత్రానికి వస్తుంటారు. ఇక్కడ కాల సర్ప దోష నివారణకు చేసే పూజకు కనీసం 3 గంటలు పడుతుంది. ఈ ఆలయంలో శివుడు మహామృత్యుంజయ రూపంలో ప్రతిష్టించబడ్డాడు.

ఇవి కూడా చదవండి

కాల సర్ప దోష నివారణకు చేయాల్సిన పరిహారాలు

కాలసర్ప దోషాన్ని నివారించడానికి గణేశుడిని పూజించడం అత్యంత ప్రయోజనకరం. గణేశుడు కేతువు బాధను శాంతింపజేస్తాడు. సరస్వతీ దేవి తనను పూజించే వారిని రాహువు నుండి రక్షిస్తుంది.

రోజూ భైరవాష్టక పూజ చేయడం వల్ల కాలసర్ప దోషం నుండి ఉపశమనం లభిస్తుంది.

కాలసర్ప దోషాన్ని తొలగించడానికి, మహామృత్యుంజయ మంత్రాన్ని రుద్రాక్ష జపమాలతో ప్రతిరోజూ 108 సార్లు జపించాలి.

కాల సర్ప దోషాన్ని నివారించడానికి ప్రత్యేకంగా బుధవారం నాడు చిటికెన వేలికి పవిత్రమైన ఉంగరాన్ని ధరించండి.

కాలసర్ప దోషం నుండి విముక్తి పొందడానికి, ప్రతి బుధవారం రాహు మంత్రాన్ని జపించి పెసరపప్పుని నల్లబట్టలో చుట్టి అవసరం అయిన వ్యక్తికి దానం చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇంకా టీవీ9 తెలుగు దీన్ని దృవీకరించడంలేదు.

వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?