Vastu Tips: అర్థిక ఇబ్బందులు లేని, సంతోషకరమైన జీవితం కోసం.. తప్పక పాటించవలసిన వాస్తు నియమాలు, చిట్కాలివే..

శివలీల గోపి తుల్వా

శివలీల గోపి తుల్వా |

Updated on: Jan 31, 2023 | 8:30 AM

ఇంటిని మనం ఎంత వాస్తు నియమాల ప్రకారం నిర్మించుకున్నప్పటికీ.. ఇంట్లో పెట్టుకునే వస్తువులు, చేసే పనుల విషయంలో వాస్తు నియమాలను పాటించవలసి ఉంటుంది. అలా పాటించకపోతే..

Vastu Tips: అర్థిక ఇబ్బందులు లేని, సంతోషకరమైన జీవితం కోసం.. తప్పక పాటించవలసిన వాస్తు నియమాలు, చిట్కాలివే..
Vastu Tips

ఇంటిని మనం ఎంత వాస్తు నియమాల ప్రకారం నిర్మించుకున్నప్పటికీ.. ఇంట్లో పెట్టుకునే వస్తువులు, చేసే పనుల విషయంలో వాస్తు నియమాలను పాటించవలసి ఉంటుంది. అలా పాటించకపోతే రకరకాల ఇబ్బందులు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎక్కడ ఏ వస్తువు ఉండాలో ఆ వస్తువు అక్కడే కచ్చితంగా ఉండి తీరాలని వారు సూచిస్తున్నారు. వాస్తు నియమాలను పాటించడం వల్ల అర్థికంగా, ఆరోగ్యపరంగా కుటుంబానికి ఎంతో శ్రేయస్సు కలుగుతుందని వారు అంటున్నారు. అలాకాకుండా వాస్తుకు విరుద్ధంగా వస్తువులను ఎక్కడపడితే అక్కడ పెడితే ఆ ఇంట్లో ఉండేవారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. తెలిసీ తెలీక వాస్తు దోషాలకు పాల్పడి ఇబ్బందులు పడుతున్న వారు సరైన వాస్తు నియమాలను తెలుసుకోవటం వల్ల మంచి జరుగుతుందని వారు అంటున్నారు.

అలాగే వాస్తు నియమాలను పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వారు తెలియజేస్తున్నారు. వాస్తు శాస్త్ర నిపుణుల సలహాలు సూచనల ప్రకారం ఎక్కడ ఏ వస్తువులు ఉంటే మేలు జరుగుతుంది..? ఎలా ఉంటే సంపద, శ్రేయస్సు మన వెంటే ఉంటుంది..? ఏ విధంగా ఉంటే మనం సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది..? వంటి అనేక విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వార్డ్ రోబ్ విషయంలో జాగ్రత్త: వాస్తు శాస్త్రంలోని నియమాల ప్రకారం ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండే వార్డ్ రోబ్ దక్షిణం దిశలో లేదా నైరుతి దిశలో ఉండాలి. లేదా ఇంటి ఉత్తర దిశ వైపు వార్డ్ రోబ్ తలుపు తెరుచుకునేలాగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనకు సంపదకు సంబంధించి ఎటువంటి నష్టాలు జరగవు. ఇంట్లో సంపద సమృద్ధిగా ఉండడంతో పాటు, ఆ ఇంట్లోని వాళ్లంతా సంతోషంగా ఉంటారు. అంతేకాక అర్థిక ఇబ్బందులు ఇంటి దరిదాపులకు కూడా రావు.

ఇవి కూడా చదవండి

డెకరేషన్ వస్తువులు కూడా ముఖ్యమే: ఇల్లు అందంగా కనపడడానికి రకరకాల ఆకర్షణీయవంతమైన డెకరేషన్ వస్తువులను ఇంట్లో పెడుతుంటారు చాలా మంది. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో అక్వేరియం పెట్టుకోవడం వల్ల కూడా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. ఇంట్లో ప్రవహించే నీరు ఉన్న అక్వేరియం ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంతోషం వెల్లివిరిస్తుందని, అక్వేరియం ఇంట్లోకి సానుకూల శక్తులను తీసుకువస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. శ్రేయస్సును, సంపదను పెంచడంలో అక్వేరియం ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. అంతేకాదు సూచిస్తున్నారు. ఇంట్లో మీరు రెండు వేణువులను కలిపి వేలాడదీస్తే అది మన కెరీర్ కు ఎంతో సహాయం చేస్తుందని, కుటుంబానికి కావలసిన శ్రేయస్సును తెస్తుందని పేర్కొంటున్నారు.

బెడ్ రూమ్ విషయం మరవకూడనివి: ఇక వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్రూంలో మంచం ముందు అద్దాలను ఉంచడం మానేయాలని, అది ఇంట్లోని గృహస్థుల శక్తిని హరించే అనారోగ్యం పాలు చేస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇక పడుకుని నిద్రించే సమయంలో తల దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలని, ఒకవేళ అలా వీలు కాకపోతే ముఖం ఈశాన్యం వైపు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. పొరపాటున కూడా ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించకూడదని అంటున్నారు. నిద్రపోయే భంగిమ విషయంలో సరైన వాస్తు నియమాలు పాటించకపోతే కూడా ఆ కుటుంబ సభ్యుల అనారోగ్యాలతో ఇబ్బంది పడతారని.. రకరకాల సమస్యలతో సతమతమవుతారని చెబుతున్నారు నిపుణులు.

బెడ్ రూమ్‌లో ఇవి కూడా ముఖ్యమే: వాస్తు ప్రకారం మంచం క్రింద చెత్త చెదారం, ఇనుప వస్తువులు లేకుండా చూసుకోవాలని, బాత్ రూమ్ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచరాదని చెప్తున్నారు నిపుణులు. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవడమే కాకుండా, ఇంట్లో పెట్టుకునే వివిధ వస్తువుల విషయంలోనూ, చేసే వివిధ పనుల విషయంలోనూ వాస్తు నియమాలను పాటించడం వల్ల ఆ ఇల్లు సంతోషంగా, సుఖశాంతులతో, సంపదకు కేంద్రంగా ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu