Festivals in August: ఆగష్టు నెలలో పండగలు, పర్వదినాలు .. పూర్తి వివరాలు మీ కోసం..
ఆగష్టు మాసంలో శ్రావణ సోమవారం, మంగళవారం, శుక్రవారాలు ప్రదోష వ్రతాలను ఆచరిస్తారు. శ్రావణ మాసంలో ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలను ఇస్తుంది. దీనితో పాటు నాగ పంచమి, రక్షా బంధన్ మహా పండుగ జరుగుతుంది. ఆగస్టు నెలలోని పండగలు, పర్వదినాల గురించి తెలుసుకుందాం..

తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆగస్టు నెల వివిధ పండుగలకు అంకితం చేయబడింది. శ్రావణ మాసంలో వ్రతాలు, పర్వదినాలు శుభకార్యాలు జరుపుకుంటారు. ఈ ఏడాది అధిక శ్రవణం కూడా రావడంతో మొత్తం 60 రోజులు శ్రావణమాసంగా జరుపుకోనున్నారు. ఆగష్టు మాసంలో శ్రావణ సోమవారం, మంగళవారం, శుక్రవారాలు ప్రదోష వ్రతాలను ఆచరిస్తారు. శ్రావణ మాసంలో ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలను ఇస్తుంది. దీనితో పాటు నాగ పంచమి, రక్షా బంధన్ మహా పండుగ జరుగుతుంది. ఆగస్టు నెలలోని పండగలు, పర్వదినాల గురించి తెలుసుకుందాం..
నాగ పంచమి
హిందూ పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే నాగ పంచమి పండుగను ఆగస్టు 21, 2023 న జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిధి ఉదయం 05:53 నుండి 08:30 వరకు ఉంది. ఈ సమయం పూజించడానికి అనుకూలమైన సమయం.




రాఖీ పండగ, శ్రావణ పూర్ణిమ
హిందూ మతానికి సంబంధించిన సోదరీమణులు ఏడాది పొడవునా వేచి చూసే రాఖీ పండుగను ఈ సంవత్సరం 30 ఆగస్టు 2023న జరుపుకోనున్నారు. పంచాంగం ప్రకారం ఈ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టే శుభ సమయం ఆగస్టు 30, 2023 ఉదయం 09:01 తర్వాత ప్రారంభమవుతుంది.
ఆగష్టు 4, 2023: శుక్రవారం.. అధిక శ్రావణ మాసం.. విభువన సంకష్టహర చతుర్థి, కృష్ణ చవితి
ఆగష్టు 12, 2023, శనివారము.. అధిక శ్రావణ మాసం.. పరమ ఏకాదశీ
ఆగష్టు 13, 2023, ఆదివారము.. అధిక శ్రావణ మాసం.. అధిక ప్రదోష్ వ్రతం.. కృష్ణ త్రయోదశి
ఆగష్టు 25, 2023, శుక్రవారము.. నిజ శ్రావణ మాసం.. వరలక్ష్మి వ్రతం
ఆగష్టు 27, 2023, ఆదివారము.. నిజ శ్రావణ మాసం.. శ్రావణ పుత్రాద ఏకాదశీ
ఆగష్టు 28, 2023, సోమవారము.. శ్రావణము, శుక్ల ద్వాదశి.. దామోదర ద్వాదశి
ఆగష్టు 28, 2023, సోమవారము.. శ్రావణము.. ప్రదోష్ వ్రతం
ఆగష్టు 30, 2023, బుధవారము.. శ్రావణ పూర్ణిమ.. రక్షా బంధన్.. హయగ్రీవ జయంతి
31 ఆగస్టు 2023: గాయత్రీ జయంతి, సంస్కృత దినం,
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)




