TS RTC: పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. బుకింగ్ ప్రారంభం.. పూర్తి వివరాలు మీకోసం
ఈసారి అరుణాచలం గిరిప్రదక్షిణకు సౌకర్యాన్ని టిఎస్ఆర్టిసి భక్తులకు మరింత సులభతరం చేసింది. అరుణాచలేస్వరుడి దర్శనం ఏర్పాట్లను పూర్తి చేసింది. అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షణకు టీఎస్ఆర్టిసి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఎంజీబీఎస్ నుంచి సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరనున్నాయి.
తమిళనాడులోని పవిత్ర పుణ్య క్షేత్రం అరుణాచలంను దర్శించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున అరుణాచలంలో చేసే గిరి ప్రదక్షిణ ప్రసిద్ధిగాంచింది. ఈ నెల 31న శ్రావణ పౌర్ణమి.. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలని భావిస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ భక్తులకు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈసారి అరుణాచలం గిరిప్రదక్షిణకు సౌకర్యాన్ని టిఎస్ఆర్టిసి భక్తులకు మరింత సులభతరం చేసింది. అరుణాచలేస్వరుడి దర్శనం ఏర్పాట్లను పూర్తి చేసింది. అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షణకు టీఎస్ఆర్టిసి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఎంజీబీఎస్ నుంచి సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరనున్నాయి.
ఈ బస్సుల్లో ప్రయాణించేవారు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ముందస్తు రిజర్వేషన్ ఇప్పటికే మొదలైంది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్న భక్తులు http://tsrtconline.in ఈ లింకు ద్వారా వెబ్సైట్లోకి వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఈ నెల ౩1న పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేసింది. వాటి ముందస్తు రిజర్వేషన్ ఈ రోజు నుంచే మొదలైంది. అరుణాచలంలో గిరిప్రదక్షిణ ప్రారంభమయ్యే 4 గంటల ముందుగానే బస్సులు అక్కడికి చేరుకుంటాయి. భక్తులు https://t.co/HaLByyiiMz సైట్లోకి… pic.twitter.com/XForwgJT2H
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) July 21, 2023
అరుణాచలంలో గిరిప్రదక్షిణ ప్రారంభంనికి నాలుగు గంటల ముందుగాని బస్సులు అక్కడికి చేరుకుంటాయి. ఈ ట్రిప్ రెండు రోజులు ఉండనుంది. ఈ రెండు రోజుల రౌండ్ ట్రిప్ లో మొదట కాణిపాక విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత మరుసటి రోజు వేలూరు లోని స్వర్ణదేవాలయం ( గోల్డెన్ టెంపుల్) దర్శించుకుంటారు. ఆ తర్వాత అదే రోజు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఎంజీబీఎస్ కు చేరుకుంటారు. అయితే ఈసారి పౌర్ణమినాడు అరుణాచలేశ్వరుని గిరిప్రదక్షిణ టీఎస్ఆర్టిసి లగ్జరీ బస్సుల ద్వారా మరింత సులభంగా మారనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..