AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Famous Lakes: తొలకరి జల్లులతో పులకరించిన ప్రకృతి.. ఈ సరస్సు అందాలు కనుల విందు..

ప్రకృతిలో అందమైన దృశ్యాలు ప్రతి ఒక్కరి మనసును ఆకర్షిస్తాయి. అలాంటి ప్రకృతి అందాల్లో ఒకటి సరస్సులు. తొలకరి జల్లుల పులకరింపుతో స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అటువంటి వారు వివిధ సరస్సులను చూడటానికి వెళ్ళవచ్చు. ఈ సరస్సుల అందం ఎవరి మనసునైనా ఆకట్టుకుంటుంది. ఆ సరస్సులు ఏవో తెలుసుకుందాం.

Surya Kala
|

Updated on: Jul 20, 2023 | 4:48 PM

Share
దేశంలో చాలా అందమైన సరస్సులు ఉన్నాయి. ఇక్కడ ప్రశాంతంగా గడపవచ్చు. అటువంటి ప్రసిద్ధ,  అందమైన సరస్సుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. ప్రకృతి రమణీయ అందాలను కనులముందుకు తెచ్చే ఈ సరస్సులను చూడటానికి కూడా వెళ్ళవచ్చు.

1 / 5
ఉదయపూర్‌లో ఉన్న పిచోలా సరస్సు  సందర్శించడానికి మంచి ప్రదేశం. ఇక్కడ మీరు జగ్ మందిర్‌ను  కూడా సందర్శించవచ్చు. ఇది ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. సరస్సులోని నీరు నీలి రంగుతో సూర్యాస్తమయం అరుణ వర్ణంతో కనుల విందు చేస్తుంది ఈ సరస్సు.. ఈ  వీక్షణను ఎవరైనా ఇష్టపడతారు.

2 / 5
సహజ సౌందర్యాన్ని ఇష్టపడేవారు దాల్ సరస్సును సందర్శించడానికి వెళ్ళవచ్చు. దీని సహజ సౌందర్యాన్ని ఎవరైనా ఇష్టపడతారు. దాల్ సరస్సులో పడవ ప్రయాణం ఆనందించవచ్చు. ఈ సరస్సు చుట్టూ ఉన్న దృశ్యాలు మనశ్శాంతిని కలిగిస్తాయి.

3 / 5
నైనిటాల్‌లో నైని సరస్సు మంచి పర్యాటక ప్రాంతం. ఈ సరస్సు పర్యాటకులతో నిత్యం రద్దీ ఉండి బాగా ప్రాచుర్యం పొందింది. మీరు కుటుంబం లేదా స్నేహితులతో ఈ సరస్సులో పడవ ప్రయాణం చేయవచ్చు. మీరు నైనిటాల్ వెళుతున్నట్లయితే, మీరు నైని సరస్సును కూడా తప్పక సందర్శించండి. 

4 / 5
తవాంగ్‌లో సెలా సరస్సు  కూడా మంచి పర్యాటక ప్రాంతం. సరస్సు చుట్టూ ఉన్న అందాలు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఈ సరస్సు  అందమైన దృశ్యాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. 

5 / 5