AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dreams: కలలో కాకులు కనిపిస్తున్నాయా.? దాని అర్ధం ఏంటో తెల్సా

ప్రతికూల కలలు, వాటి అర్థాల గురించి మీకు తెల్సా.. కాకుల కలలు, తుఫానులు, ఇల్లు కూలిపోవడం, అడవి జంతువులు, పక్షుల ఎగరడం లాంటి కలలు మీకు వస్తుంటాయి. ఈ కలలు ఆర్థిక నష్టం, అనారోగ్యం, ప్రమాదం లేదా కుటుంబంలో సమస్యలను సూచిస్తాయని కలల శాస్త్రం చెబుతోంది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Dreams: కలలో కాకులు కనిపిస్తున్నాయా.? దాని అర్ధం ఏంటో తెల్సా
Dreams
Ravi Kiran
|

Updated on: Jan 19, 2025 | 9:12 AM

Share

మనకు నిద్రలో వచ్చే కలలన్ని కూడా అసంకల్పిత మనస్సులోని చిత్రాలు. కలల శాస్త్రంలో మనం చూసే ప్రతి కలకి ఓ అర్ధం ఉంటుంది. అలాగే కొన్ని కలలు మన భవిష్యత్తులో జరిగే అరిష్టమైన సంఘటనలను సూచిస్తాయి. మీ కలలో చాలా రకాల సంఘటనలు మీకు కనిపించి ఉంటాయి. కాబట్టి ప్రతి కలకు ఉండే స్వంత అర్ధం ఏంటి.? శుభమా లేక అశుభమా? ఇక్కడ తెలుసుకుందామా..?

ఇది చదవండి: ఐపీఎల్‌లో 9 కోట్ల ప్లేయర్.. కట్ చేస్తే.. 8 ఫోర్లు, 5 సిక్సర్లతో శివతాండవం ఆడాడు.. ఎవరంటే.?

కలలో కాకి కనిపిస్తే దాని అర్థం ఏమిటి?

కలలో కాకిని చూడటం అశుభం. ఇది భారీ ప్రమాదాన్ని సూచిస్తుంది. ఎవరి మరణవార్త అయినా వినే అవకాశం ఉంది. మీరు మీ కలలో కాకిని చూస్తే, మీ జీవితంలో ఏదో మార్పు వస్తుందని అర్థం చేసుకోవాలి. వారి కర్మ ఫలితంగా ఏదో అనుభవిస్తున్నారని అంటారు. కలలో కాకి కనిపిస్తే ఉదయాన్నే శనిదేవుడిని దర్శించుకోవాలని పెద్దలు చెబుతారు. అలాగే మీ కలలో నల్లని వస్త్రాలు లేదా ఎక్కువగా నల్లని దుస్తులు ధరించే వ్యక్తి కనిపిస్తే, అది అనారోగ్యానికి సంకేతంగా పరిగణిస్తారు.

ఇవి కూడా చదవండి

కలలో తుఫాను లేదా ఇల్లు కూలిపోతుంటే..

తుఫాను లేదా ఇల్లు కూలిపోతున్నట్లు కలలు కంటే దురదృష్టం నీడలా మీపై పడుతుందని అర్థం. మీ జీవితంలో చాలా నష్టం ఉండవచ్చు అనడానికి సంకేతం. అలాగే కలలో చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం కనిపించడం కూడా అశుభం. అలాంటి కల ఒక వ్యక్తి తన జీవితంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందనడానికి సూచన.

ఇది చదవండి: ఎమర్జెన్సీ లోన్ కావాలా.? ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఎలానో తెల్సా

కలలో అడవి జంతువులు, పక్షులు కనిపిస్తే..

కలలో అడవి జంతువులు వెంబడించే దృశ్యాలను చూడటం ప్రతికూల ఫలితాల సంకేతం. అలాంటి కల తీవ్రమైన ఆర్థిక నష్టానికి సూచికగా పరిగణించాలి. అలాగే మీ కలలో పక్షులు ఎగురుతూ ఉంటే, మీరు త్వరలో ఆర్థికంగా నష్టపోతారని అర్థం. అలాగే, మీరు కలలో పెద్ద శబ్దం విన్నట్లయితే, అది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వివాదానికి సంకేతంగా పరిగణించబడుతుంది.

ఇది చదవండి: పటాస్ మూవీ చిన్నది గుర్తుందా.? అందాలతో అరాచకమే.. ఇప్పుడు చూస్తే స్టన్!

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..