AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు నిలబడే విధానమే మీరెలాంటివారో చెప్పేస్తుందని తెల్సా..

కొంతమంది మన మాటతీరును చూసి, మరికొందరు మన నడవడికను చూసి.. ఇంకొందరైతే మన కళ్లను చూసి మన వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తారు. అయితే ఇక్కడ కొందరు మన నిలబడే విధానంతోనే మన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చునని అంటున్నారు. మరి అదెలాగో చూసేద్దామా..

మీరు నిలబడే విధానమే మీరెలాంటివారో చెప్పేస్తుందని తెల్సా..
Personality Test
Ravi Kiran
|

Updated on: Jan 18, 2025 | 11:30 AM

Share

మనుషులన్నాక.. ఏ ఇద్దరూ ఒకేలా ఉండరు. వ్యక్తిత్వం అనేది ఒకరి నుంచి మరొకరికి భిన్నంగా ఉంటుంది. ప్రేమ, కోపం, శాంతం, సహనం.. ఇలా భావోద్వేగాలు ఎన్ని ఉన్నా.. ఈ ఎమోషన్స్‌ అన్నింటిని సమర్ధవంతంగా కంట్రోల్ చేసుకునే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఏదొక లోపం ఉంటుంది. ఇదిలా ఉంటే.. చాలామంది మన మాటతీరును బట్టి.. లేదా మన కళ్లను బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటారు. అలాగే వారు నిలబడే విధానం బట్టి కూడా వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చునని కొందరు చెబుతున్నారు. నడవడం, కూర్చోవడం, మాట్లాడటం.. ఇలా వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. నిలబడే విధానం కూడా అంటే కొంతమంది నిటారుగా నిలబడతారు. మరికొందరు ఒక కాలు ముందుకు చాచి నిలబడతారు. ఈ భంగిమలన్ని కూడా మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయట.

ఇది చదవండి: కమ్మటి సమోసాలో మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని చూడగా.. అమ్మబాబోయ్.!

నిలబడి కాళ్లను ఒకదానికొకటి సమాంతరంగా ఉంచడం:

ఒక వ్యక్తి రెండు కాళ్లను ఒకదానికొకటి సమాంతరంగా ఉంచినట్లయితే, అది విధేయత లేదా అధికారం పట్ల గౌరవాన్ని చూపుతున్నాడని అర్ధం. ఈ వ్యక్తులు మంచి శ్రోతలు, ప్రతి విషయాన్ని అంగీకరిస్తారు. ఒకరితో ఏదైనా విషయంపై సంభాషణ జరుగుతున్నప్పుడు.. తమ తెలివి, చాకచక్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ భంగిమలో నిలబడటం వలన అతిగా ఉద్రేకం, భయం వంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు ప్రశాంతం అయిపోతారు. తటస్థ వైఖరిని కలిగి ఉన్న వ్యక్తులు. అంత తేలిగ్గా తల వంచరు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా

కాళ్లను కొద్దిగా దూరంగా ఉంచడం:

కాళ్లను కొద్దిగా దూరంగా ఉంచి నిలబడే వ్యక్తులు అధికార, ఆజ్ఞాపించే వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తారు. ఈ వ్యక్తులు మితిమీరిన ఆత్మవిశ్వాసం, నిశ్చయత కలిగి ఉంటారు. నమ్మకంగా, దృఢమైన స్వభావంతో ఈ వ్యక్తులు తమ చుట్టూ ఉన్నవారిని చాలా త్వరగా ఆకర్షిస్తారు.

ఒక కాలు ముందుకు ఉంచి నిలబడటం:

కొంతమంది నిలబడినప్పుడు ఒక కాలు ముందుకు ఉంచుతారు. ఈ భంగిమలో నిలబడే వారికి చుట్టుపక్కల వారితో మంచి అనుబంధం ఉంటుంది. అందరితో హ్యాపీగా, సంతృప్తిగా ఉండాలనుకుంటారు. వారు తమ భావాలను బహిరంగంగా చూపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నిజాయితీపరులు, ఏది చెప్పినా సూటిగా చెప్తారు.

నిలబడి ఉన్నప్పుడు క్రాస్-లెగ్డ్:

ఈ భంగిమ వ్యక్తులు అందరితో కంటే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. సైలెన్స్, విధేయతతో, వారు తమ భావాలను ఎవ్వరికీ తెలియనివ్వరు. కానీ చాలా సందర్భాల్లో ఆత్మవిశ్వాసం వారికి ఉండదు. అపరిచితులతో కూడా అంత త్వరగా కలవరు. కొత్త వ్యక్తులను, కొత్త అనుభవాలను కలుపుకుని పోవడానికి సిద్ధంగా లేని వ్యక్తిత్వం వీరిది.

ఇది చదవండి: రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.? అందాలతో గత్తరలేపుతోందిగా

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి