Makhana: ఫూల్ మఖానా పురుషులకు వరం..! పాలలో కలిపి తింటే అద్భుతమైన ప్రయోజనాలు..
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇందుకోసం పోషక విలువలున్న పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో భాగంగా చాలా మంది ప్రజలు పాలు, మఖానా కలిపి తినడానికి ఇష్టపడతారు. దీని కారణంగా శరీరంలో అనేక మార్పులు కనిపించడం ప్రారంభిస్తాయి. మఖానాలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. పాలలో శక్తిని ఇవ్వడానికి సహాయపడే పోషకాలు కూడా వీటిలో ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల మీకు మరింత శక్తి లభిస్తుంది. పాలలో మఖానా వేసి తింటే ఏమౌతుందో తెలుసుకుందాం?
Updated on: Jan 18, 2025 | 11:16 AM

మీకు మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే మఖానాను అస్సలు తినకండి. ఇందులో కాల్షియం ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల పరిమాణాన్ని పెంచుతుంది. మీకు జలుబు, విరేచనాలు లేదా సాధారణ ఫ్లూ ఉంటే మఖానా తినకండి. మఖానా తక్కువ కేలరీలతో ఉన్నా, ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కంటే నిత్యం మితంగా తీసుకోవడం మంచిది.

మఖానాను ఎక్కువగా తినడం వల్ల కొంతమందికి అలెర్జీలు రావచ్చు. ఫ్లూ, దగ్గు లేదా విరేచనాలు వంటివి. ఇది కాకుండా, చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. మఖానా తక్కువ కేలరీల చిరుతిండి అయినప్పటికీ, దాని అధిక వినియోగం కూడా బరువును పెంచుతుంది.

తామర గింజలు తినడానికి చాలా తేలికగా ఉంటాయి. కానీ వాటి అధిక వినియోగం మలబద్ధకానికి కారణమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫైబర్ అధికంగా తీసుకోవడం వల్ల పేగు పనితీరుపై ప్రభావం చూపుతుంది, దీనివల్ల కడుపు ఉబ్బరం వస్తుంది.

మఖానాలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. మఖానాలో ఫాస్పరస్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీన్ని రోజువారీ స్నాక్స్‌గా తీసుకోవచ్చు. అంతేకాదు.. ఫూల్ మఖానాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మఖానాలో స్పెర్మ్ నాణ్యత, కౌంట్ మెరుగుపరిచే లక్షణాలు ఉన్నాయి.

మఖానాకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీంతో మఖానా రక్తంలోకి గ్లుకోజ్ విడుదలను నెమ్మది చేస్తుంది. దీనివల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. డయాబెటిస్ పేషెంట్లకు కూడా ఇది మంచి స్నాక్.




