- Telugu News Photo Gallery Dreams Astrology: If You See These In Dream It Leads To Inauspicious Signs
Dreams: కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అయితే మీ లైఫ్‌లో జరిగేది ఇదే
కలలు అనేవి మన మనసులోని అసంకల్పిత భావాలకు కనిపించే చిత్రాలు. సాధారణంగా కలలు కనేవారికి ఎక్కువగా జీవిత సంఘటనలు కనిపిస్తాయని పరిశోధకులు నమ్ముతారు. మరి మీరు కనే కలలు దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ స్టోరీ ఇలా ఉంది. మీకోసమే
Updated on: Jan 18, 2025 | 10:00 AM

మీరు మీ కలలో ఎద్దుల బండిని చూస్తే, జీవితంలో కార్యకలాపాలన్ని నెమ్మదిగా సాగుతున్నాయని అర్ధం. ఇది భవిష్యత్తులో వైఫల్యాలను కూడా సూచిస్తుంది. అలాగే మీరు దట్టమైన చీకటి మేఘాలను చూస్తే, అది దురదృష్టానికి చిహ్నం.

కలలో నల్ల కాకి కనిపిస్తే అశుభం అంటారు. ఇది భారీ ప్రమాదాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా ఎవరిదైనా మరణవార్త వినే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.

మీ కలలో తరచుగా నల్లని బట్టలు లేదా నల్లటి బట్టలు ధరించే వ్యక్తిని చూస్తే, అది మీకు వచ్చే తీవ్రమైన వ్యాధుల సంకేతం కావచ్చు. అదేవిధంగా, కలలో రక్తస్రావం దృశ్యాలు కనిపిస్తే అనారోగ్యానికి సంకేతంగా పరిగణించాలి.

కలలో అడవి జంతువులు వెంబడించడం వంటి దృశ్యాలను చూడటం ప్రతికూల ఫలితాలకు సంకేతం. అలాంటి కల తీవ్రమైన ఆర్థిక నష్టానికి సూచికగా పరిగణించాలి.

తుఫాన్, హరికేన్ లేదా ఇల్లు కూలిపోతున్నట్లు కలలుగన్నట్లయితే, దురదృష్టం మీపై నీడలా కమ్మేసిందని అర్ధం. జీవితంలో చాలా పెద్ద హాని కలుగుతుందని అర్ధం.

కలలో చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం కనిపించడం అశుభం. అలాంటి కల ఒక వ్యక్తి జీవితంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటాడని సూచిస్తుంది. మీ కలలో పక్షులు ఎగురుతూ ఉంటే, మీరు త్వరలో ఆర్థికంగా నష్టపోతారని అర్థం.

కలలో పెద్ద శబ్దం వినిపిస్తే.. ఆ కల కనేవారి ఇంటిలోని కుటుంబ సభ్యుల మధ్య అగ్గికి సంకేతంగా పరిగణించవచ్చు.

కలలు మనిషిలోని అసంకల్పిత మనస్సులోని ప్రతిరూపాలు. అతడి అనుభవాలు, భావోద్వేగాలు, ఆందోళనలను ప్రతిబింబిస్తాయి. కాబట్టి కలలు మన జీవితంలో ప్రతీదానిని నిర్ణయించవని అర్ధం చేసుకోవాలి.




