AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఎమర్జెన్సీ లోన్ కావాలా.? ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఎలానో తెల్సా

మీకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే, మీరు ఆధార్ కార్డు సహాయంతో లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దాని కోసం మీరు NBFC(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ), ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Aadhaar Card: ఎమర్జెన్సీ లోన్ కావాలా.? ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఎలానో తెల్సా
Ravi Kiran
|

Updated on: Jan 18, 2025 | 5:30 PM

Share

మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైనప్పుడు.. మీ స్నేహితుడు లేదా బంధువు చేతులెత్తేయడం మీరు చూస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితులు మీరు చాలానే ఎదుర్కుని ఉంటారు. అయితే ఇలాంటి స్థితిలో కేవలం ఆధార్ కార్డుతో రూ. 10 వేలు లోన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయమేంటంటే.. దీన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. మీ సౌలభ్యం ప్రకారం వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. అలాగే, ఈ రూ.10,000 రుణానికి ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఆ వివరాలు చూసేద్దామా..

ఇది చదవండి: కమ్మటి సమోసాలో మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని చూడగా.. అమ్మబాబోయ్.!

ఆధార్ కార్డ్ లోన్..

ఆధార్ కార్డుపై లభించే రూ.10,000 రుణాన్ని పర్సనల్ లోన్ అంటారు. ఈ లోన్ కోసం ఎలాంటి వ్యక్తిగత పత్రాలను అడగరు. కేవలం ఆధార్ కార్డును మాత్రమే చూపించాలి. ఆ వెంటనే రూ.10,000 మీ ఖాతాకు బదిలీ అవుతాయి. మీరు ఆధార్‌తో పాటు పాన్ కార్డును కూడా ఉపయోగిస్తే, అధిక మొత్తంలో రుణాన్ని కూడా పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆధార్ కార్డుపై రుణం ఎవరు ఇస్తారు?

ప్రభుత్వ బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందించడం చాలా తక్కువ. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, మీరు రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు పాన్ కార్డును ఉపయోగిస్తే, ప్రైవేట్ బ్యాంకులు సులభంగా వ్యక్తిగత రుణాలను ఇస్తాయి. మీకు పాన్ కార్డ్ లేకపోతే, మీరు ఆధార్ కార్డ్ సహాయంతో NBFC(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ), ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి పర్సనల్ లోన్ తీసుకోవచ్చు.

ఇది చదవండి: కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

మీకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే, మీరు ఆధార్ కార్డ్ సహాయంతో దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, దీనిలో మీరు NBFC(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ), ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి. ఆధార్ కార్డు, అవసరమైన వివరాలను అందించడం ద్వారా మీరు సులభంగా వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు.

ఈ రుణానికి అర్హతలు ఏంటి.?

ఆధార్ కార్డ్ సాయంతో, 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో, ఉద్యోగం లేదా సొంత వ్యాపారం ఉన్న వ్యక్తులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితో పాటు, మీరు యాక్టివ్ బ్యాంక్ ఖాతాను కూడా కలిగి ఉండాలి.

ఇది చదవండి: రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.? అందాలతో గత్తరలేపుతోందిగా

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..