- Telugu News Photo Gallery Amit Shah in Hyderabad: Charminar Bhagyalakshmi Temple Visit and Political Rally
చార్మినార్ భాగ్య లక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం రోజు హైదరాబాద్ పర్యాటనలో భాగంగా భాగ్యలక్ష్మీ అమ్మవారిని సందర్శించుకున్నారు. అమిత్ షా పర్యాటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. బేగంపేట విమానాశ్రయంలో దిగిన ఆయనకు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సహా కమలం పార్టీ ముఖ్య నేతలు సాదరంగా ఆహ్వానం పలికారు.
Updated on: Nov 02, 2026 | 3:46 PM

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం రోజు హైదరాబాద్ పర్యాటనలో భాగంగా భాగ్యలక్ష్మీ అమ్మవారిని సందర్శించుకున్నారు. అమిత్ షా పర్యాటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. బేగంపేట విమానాశ్రయంలో దిగిన ఆయనకు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సహా కమలం పార్టీ ముఖ్య నేతలు సాదరంగా ఆహ్వానం పలికారు.

ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా పాతబస్తీ చేరుకున్న హోంమంత్రి, చారిత్రక చార్మినార్ చెంత వెలసిన శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. వీఐపీ పర్యటన నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు భారీ ఎత్తున నిఘా పెంచి భద్రతను పర్యవేక్షించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆయన కాకతీయ హోటల్‌కు చేరుకుని కొంత సమయం గడిపారు.

ఇక భాగ్య లక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం, అమిత్ షా హైదరాబాద్‌లోని శ్రీ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి పూజలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజలందరూ సుఖశాంతులు, సిరిసంపదలతో ఎల్లప్పుడూ వర్ధిల్లాలని ఆ లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించాను. అంటూ ట్వీట్ చేశారు.

పర్యటన మొదట్లోనే కాంగ్రెస్ లక్ష్యంగా అమిత్ షా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో వరుస పరాజయాలను జీర్ణించుకోలేక, హింసాత్మక లేదా అరాచక మార్గాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణచివేసి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ తరహా కుట్రలను తిప్పికొట్టి రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసమే తాను నగరంలో గళమెత్తుతున్నట్లు పేర్కొన్నారు.

షెడ్యూల్ ప్రకారం.. సాయంత్రం 4 గంటలకు నిజాం కళాశాల సమీపంలోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి నివాళులర్పించి.. ప్రజాస్వామ్య పరిరక్షణ - అరాచక నిర్మూలన అనే నినాదంతో భారీ ర్యాలీగా మొజాంజాహీ మార్కెట్ వరకు పాదయాత్ర చేపడతారు.

ఎంజే మార్కెట్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా కీలక ప్రసంగం చేస్తారు. ఇక్కడి నుంచే బీజేపీ శ్రేణులకు రాజకీయ దిశానిర్దేశం చేయనున్నారు.

బహిరంగ కార్యక్రమం ముగియగానే ఆయన ప్రత్యేక విమానంలో హస్తినకు తిరుగుపయనం కానున్నారు. హోంమంత్రి రాకను పురస్కరించుకుని నగర పోలీస్ శాఖ భారీగా బలగాలను మోహరించి, ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టింది.
