Dwaraka Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం చిన తిరుపతిలో కుక్కలు హల్ చల్.. ఒకొక్క కుక్క పట్టినందుకు రూ.500 చెల్లింపు
Dwaraka Tirumala: ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల. శేషాద్రి కొండపైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు ద్వారకా తిరుమలలో కొలువుదీరి..
Dwaraka Tirumala: ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల. శేషాద్రి కొండపైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు ద్వారకా తిరుమలలో కొలువుదీరి ఉన్నారు. అయితే తాజాగా శేషాచల కొండపై కుక్కలు హల్ చల్ చేస్తున్నాయి. చిన్న వెంకన్న ఆలయ ప్రాంగణంలో భారీ సంఖ్యలో కుక్కలు సంచరిస్తున్నాయి. ఈ కుక్కలను చూసి భక్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన దేవాలయ అధికారులు భక్తులకు భక్తులకు అసౌకర్యం కలిగిస్తున్నాయని కుక్కలను పట్టిస్తున్నారు.
ఈ శేషాచల కొండపై సంచరిస్తున్న కుక్కలను పట్టడానికి ఒక ప్రత్యేక బృందాన్ని దేవస్థానం అధికారులు రంగంలోకి దింపారు. ఆలయ ప్రాంగణంలో సంచరిస్తున్న కుక్కలను నిదవోలుకు చెందిన ప్రత్యేక బృందం పట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ బృందం క్షేత్రంలో సంచరిస్తున్న దాదాపు 50 కుక్కలు పట్టి వాటిని వ్యాన్లో బంధించి ఇతర ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఇలా ఒకొక్క కుక్కను పెట్టినందుకు రూ. 500లను ఆలయాధికారులు ఈ బృందానికి ఇస్తోంది.
సుదర్శన క్షేత్రమైన ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెంది. స్వయంభువుగా ప్రత్యక్షమైన శీ వెంకటేశ్వర స్వామివారిని చీమలపుట్ట నుంచి ద్వారక అనే ముని వెలికి తీశారు. అందుకనే ఈ క్షేత్రం ఆయన పేరుమీదుగా ద్వారకా తిరుమల అని వచ్చినట్లు పూర్వీకుల కథనం. ఇక్కడ శ్రీవారు అశేష భక్త జనావళి నీరాజనాలు అందుకుంటున్నారు.
Also Read: