Tirumala Darshan: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కరోనా నిబంధనలను మరింత కఠినం చేసిన టీటీడీ..

Tirumala Darshan: దేశంలో మళ్ళీ కరోనా వైరస్ మహ్మమారి వేగంగా వ్యాపిస్తున్న వేళ.. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కోవిడ్ మార్గదర్శకాలు మరింత కఠినంగా అమలు చేయనున్నారు. మళ్ళీ కోవిడ్ కేసులు..

Tirumala Darshan: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కరోనా నిబంధనలను మరింత కఠినం చేసిన టీటీడీ..
Tirumala
Follow us

|

Updated on: Jan 10, 2022 | 1:18 PM

Tirumala Darshan: దేశంలో మళ్ళీ కరోనా వైరస్ మహ్మమారి వేగంగా వ్యాపిస్తున్న వేళ.. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కోవిడ్ మార్గదర్శకాలు మరింత కఠినంగా అమలు చేయనున్నారు. మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం దృష్ట్యా తిరుమలలో కోవిడ్ మార్గదర్శకాలు మరింత కఠినంగా అమలు చేయాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల లోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి కోవిడ్ మార్గదర్శకాల అమలు పై అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి ఇతర ఆధికారులతో సమీక్షించారు.

జనవరి 13వ తేదీ వైకుంఠ ఏకాదశి,14వ తేదీ ద్వాదశి ద్వాదశి తో పాటు మిగిలిన 8 రోజులు భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జనసమూహం ఉండే ప్రాంతాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లు, శ్రీవారి ఆలయంలో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి ఒక్క భక్తుడు, ఉద్యోగులు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఆదేశించారు. ఇందుకోసం భక్తులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో క్యూ లైన్, శ్రీవారి ఆలయంలో భక్తులు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. భక్తులు తోపులాటకు దిగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళేలా ఏర్పాట్లు చేయాలని ఛైర్మన్ అధికారులను ఆదేశించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, అధికారులు, ఉద్యోగులకు సహకరించాలని ఛైర్మన్  సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 13న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రేపు  బ్రేక్ దర్శనాలను రద్దీ చేశారు. అంతేకాదు సిఫారసు లేఖలు స్వీకరించమని స్పష్టం చేసింది.

Also Read: ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కల్లోలం.. 11 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్..

 తమకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేసిన తాలిబన్లు.. మీడియాకు కొత్త నిబంధనలు..