AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2025: దీపావళి రోజున తులసిని ఇలా పూజించండి.. జీవితంలో సిరి సంపదలకు లోటే ఉండదు..

దీపావళి రోజున లక్ష్మి, గణేశుని పూజించడం సంప్రదాయం. అంతేకాదు ఈ రోజున లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక ఆచారాలు కూడా నిర్వహిస్తారు. ఇవి చాలా ముఖ్యమైనవి. నమ్మకాల ప్రకారం ఈ రోజున విష్ణు ప్రియ తులసి మొక్కను సాంప్రదాయం, ఆచరాల ప్రకారం పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

Diwali 2025: దీపావళి రోజున తులసిని ఇలా పూజించండి.. జీవితంలో సిరి సంపదలకు లోటే ఉండదు..
Diwali Tulasi Puja
Surya Kala
|

Updated on: Oct 13, 2025 | 3:57 PM

Share

హిందువులు జరుపుకునే పండగలలో దీపావళి పండగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అమావాస్య చీకట్లని దీపాల వెలుగులతో తొలగించే దీపాల పండగను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజుని దీపావళి పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు. లక్ష్మీదేవి, గణేశుడిని కూడా పూజిస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం , శాంతి లభిస్తుందని, సిరి సంపదలకు లోటు ఉందని.. అదృష్టం పెరుగుతుందని మత విశ్వాసం. అంతేకాదు లక్ష్మీదేవి ఆశీస్సులు ఆ ఇంటి సభ్యులపై ఎల్లప్పుడూ ఉంటాయని విశ్వాసం.

దీపావళి రోజున లక్ష్మీదేవి, గణపతిని పూజించడంతో పాటు.. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక ఆచారాలు కూడా నిర్వహిస్తారు. ఇవి చాలా ముఖ్యమైనవి. నమ్మకాల ప్రకారం ఈ రోజున తులసితో కూడిన ఆచారాలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి జీవితంలో శ్రేయస్సు వస్తుంది. దీపావళి రోజున తులసి మొక్కను ఏ విధంగా పూజించాలి ఈ రోజు తెలుసుకుందాం.

దీపావళి 2025 ఎప్పుడు? వేద క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసంలో అమావాస్య అక్టోబర్ 20న తెల్లవారుజామున 03:44 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి అక్టోబర్ 21న ఉదయం 05:54 గంటలకు ముగుస్తుంది. కనుక ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 20న జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

దీపావళి నాడు తులసిని ఎలా పూజించాలంటే

తులసి దగ్గర దీపం వెలిగించండి దీపావళి నాడు తులసి మొక్క దగ్గర దేశీ ఆవు నెయ్యి దీపం వెలిగించి.. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఈ పరిహారం లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది . సురక్షితమైన జీవితాన్ని అందిస్తుంది.

తులసి పూజ దీపావళి రోజున తులసి పూజ చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత, తులసి మొక్కను పూజించాలి. తులసి మొక్కకు వైవాహిక జీవితంలో ఆనందం కోసం పసుపు, కుంకుమ, గాజులు, రవిక, పెట్టి పూజ చేసి ఆవు పాలతో చేసిన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ వస్తువులను వివాహిత స్త్రీకి వాయినంగా అందించాలి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం కలుగుతుంది.

తులసి మొక్కకు గంగా జలం సమర్పణ దీపావళి నాడు కొద్దిగా గంగా జలం కలిపిన నీటిని తులసికి సమర్పించాలి. తులసి మంత్రాలను కూడా జపించాలి. దీపావళి నాడు ఈ విధంగా చేసే పూజ పరిహారాల వల్ల శుభ ఫలితాలు వస్తాయి. లక్ష్మీ దేవి ఆశీస్సులతో.. నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.