AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరస్వతి విగ్రహానికి చున్నీ కప్పి మరీ ప్రభుత్వ పాఠశాలలో నాన్-వెజ్ పార్టీ ..

చదువు చెప్పే ప్రభుత్వ పాఠశాల పార్టీకి వేదికగా మారింది. చికిన్, మటన్ వంటి ఆహారంతో నాన్ వెజ్ పార్టీ చేసుకున్నారు. ఈ సమయంలో స్కూల్ లో ఉన్న సరస్వతి దేవి విగ్రహానికి కండువా కప్పారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో వివాదానికి దారితీసింది. దీంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత స్కూల్ ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఈ విషయం గుజరాత్ లోని ముఖ్య పట్టణమైన సూరత్ లో చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.

సరస్వతి విగ్రహానికి చున్నీ కప్పి మరీ ప్రభుత్వ పాఠశాలలో నాన్-వెజ్ పార్టీ ..
Non Veg Party In School
Surya Kala
|

Updated on: Oct 13, 2025 | 3:27 PM

Share

గుజరాత్‌లోని సూరత్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మాంసాహారం వడ్డించడం వివాదానికి దారితీసింది. ఆశ్చర్యకరంగా.. స్కూల్ నిర్వాహకులు ఈ సమయంలో పాఠశాల ఆవరణలోని సరస్వతి దేవి విగ్రహాన్ని వస్త్రంతో కప్పారు. స్కూల్ లో పార్టీ గురించి తెలుసుకున్న మీడియా సంఘటనా స్థలానికి రావడంతో పాఠశాల సిబ్బంది. ఉపాధ్యాయులు పారిపోయారు. ఈ విషయంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని విద్యా కమిటీ చైర్మన్ హామీ ఇచ్చారు.

ఈ సంఘటన ఆదివారం గొదాదరలోని శిక్షన్ సమితి పాఠశాలలో జరిగింది. అక్కడ నాన్ వెజ్ వంటకాలతో ఓ రేంజ్ లో పార్టీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం జరిగే సమయంలో నిర్వాహకులు పాఠశాల ఆవరణలోని సరస్వతి దేవి విగ్రహాన్ని చీరతో కప్పారు. నివేదికల ప్రకారం 1987 నుంచి 1991 మధ్య పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ పార్టీని నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీలో చికెన్ , మటన్ పుష్కలంగా వడ్డించారు. ప్రిన్సిపాల్ కూడా హాజరయ్యారు.

అమ్మవారి విగ్రహాన్ని చీరతో కప్పారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పాఠశాల ఆవరణలోని సరస్వతి దేవి విగ్రహాన్ని కండువాతో కప్పారు. అందరూ ఉదయం చేరుకున్నారని.. ఆ తర్వాత కార్యక్రమం జరిగిందని పాఠశాల సెక్యూరిటీ గార్డు తెలిపారు. ఈ విషయంపై విద్యా కమిటీ చైర్మన్ రాజేంద్ర కపాడియా, ప్రతినిధి వినోద్ గజేరా మాట్లాడుతూ.. పాఠశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడామని, ఆయన తన తప్పును అంగీకరించారని తెలిపారు. ఈ విషయంపై చర్చించడానికి కమిటీ సోమవారం సమావేశమయింది. సమగ్ర దర్యాప్తు తర్వాత ప్రిన్సిపాల్ కఠినమైన, తగిన చర్య తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

భాబువాలో కూడా ఇదే విధంగా చికెన్ పార్టీ కొన్ని నెలల క్రితం బీహార్‌లోని భాబువా జిల్లాలో ఇలాంటి చికెన్ పార్టీ సంఘటన జరిగింది. అక్కడ 11 మంది ఉపాధ్యాయులు పాఠశాల లోపల చికెన్ వండుకుని తిన్నారు. పార్టీ వీడియో వైరల్ అయింది. దీనిలో ఉపాధ్యాయులు చికెన్‌ను రుచి చూస్తున్నట్లు చూపించారు. ఈ వీడియోపై దర్యాప్తు తర్వాత విద్యా శాఖ 11 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..