AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ వ్యక్తులకు వీలైంత దూరం ఉండాలి.. లేకపోతే జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది..

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా..

Chanakya Niti: ఈ వ్యక్తులకు వీలైంత దూరం ఉండాలి.. లేకపోతే జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది..
Chanakya Niti
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 20, 2022 | 9:26 AM

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు. ఆచార్య చాణక్యుడి విధానాలు నేటికీ అనుచరనీయం. ఈ విధానాల ఆధారంగానే ఆచార్య చాణక్యుడు ఒక సాధారణ బాల చంద్రగుప్త మౌర్యుడిని చక్రవర్తిగా చేశాడు. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో పేర్కొన్న అనేక అంశాల్లో.. కొందరు వ్యక్తులకు ఎల్లప్పుడు దూరంగా ఉండాలని సూచించారు. లేదంటే.. జీవితంలో పాశ్చాత్తాప పడాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. మరి ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలో ఇవాళ మనం తెలుసుకుందాం..

ఆచార్య చాణక్యుడు తన శ్లోకాలలో ఒక వ్యక్తి జీవితం ప్రశాంతంగా ఉండాలంటే.. కొందరు వ్యక్తులకు దూరంగా ఉండాలని సూచించారు. వారి సాంగత్యంలోకి రావడం వల్ల జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు. పుట్టుకతో గుడ్డివాడు ఏదీ చూడలేడు. అలాగే కామంతో రగిలిపోయే వాడికి కూడా తప్పు, ఒప్పు ఏదీ కనిపించదు. మత్తుల్లో ఉన్నవాడికి కూడా ఏదీ కనిపించదు. ఇక అధమస్తులు ఇతర ఎదుగుదలను ఓర్వలేక కడుపుమంటతో రగిలిపోతుంటారు. వారు ఎదగలేక ఇతరులను దూషిస్తుంటారని చాణక్య తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు.

ఎవరికి దూరంగా ఉండాలి..

స్వార్థపరులు: ఆచార్య చాణక్యుడి ప్రకారం స్వార్థపరులకు దూరంగా ఉండాలి. అలాంటి వారు ఎవరినీ పట్టించుకోరు. వారు తమ ప్రయోజనాల కోసం ఎవరికైనా హానీ తలపెడతారు. అందుకే స్వార్థపరులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

కామంతో రగిలిపోయేవాడు: కామంతో నిండిపోయిన వారిని ఎప్పుడూ విశ్వసించకూడదు. అలాంటి వ్యక్తిని నమ్మడం ద్వారా పెద్ద సమస్యలో ఇరుక్కుంటారు. అందుకే అలాంటి వారికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. ఈ వ్యక్తుల వల్ల మీ పరువు పోవడం ఖాయం.

అసూయపరులు: మీ పట్ల అసూయపడే వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. అలాంటి వారు మీరు విజయం సాధించడాన్ని చూడలేరు. మీ ఎదుగుదలను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. అనేక అడ్డంకులు సృష్టిస్తారు. అందుకే అసూయపరులకు దూరంగా ఉండాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..