- Telugu News Photo Gallery Chanakya Neeti keep distance from these people or else you will ruin your life Chanakya Niti in Telugu
Chanakya Neeti: అలాంటి వ్యక్తులను జీవితంలో దగ్గరకు రానివ్వకండి.. చాణుక్యుడు చెప్పిన సంచలన నిజాలు ఇవే..
ఆచార్య చాణక్యుడు.. నీతి శాస్త్రంలో దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించాడు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా ప్రతీ వ్యక్తి తన జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవచ్చు.
Updated on: Nov 20, 2022 | 6:12 PM

ఆచార్య చాణక్యుడు.. నీతి శాస్త్రంలో దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించాడు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా ప్రతీ వ్యక్తి తన జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవచ్చు. అందుకే చాలామంది జీవితంలో తప్పటడుగులు వేయకుండా ఉండేందుకు.. ఉన్నత స్థానంలో ఎదిగేందుకు చాణుక్యుడు నీతిశాస్త్రంలో బోధించిన విషయాలను అనుసరిస్తుంటారు.

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అలాంటి వారికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలంటూ హితవుపలికాడు. ఇలా చేయడం వల్ల తర్వాత పశ్చాత్తాపపడాల్సి రావచ్చని పేర్కొన్నాడు. ఆచార్య చాణక్యుడు తన శ్లోకాలలో ఒక మనిషి దూరంగా ఉండాల్సిన వ్యక్తుల గురించి ప్రస్తావించాడు. వారు మన జీవితంలోకి రావడం వల్ల జీవితం నాశనం అవుతుందని పేర్కొన్నాడు.

స్వార్థపరులు : ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ఒక వ్యక్తి స్వార్థపరుల నుంచి దూరంగా ఉండాలి. అలాంటి వారు ఎవరినీ పట్టించుకోరు. వారు తమ ప్రయోజనాల కోసం ఎవరికైనా హాని చేయవచ్చు. అందుకే వారికి దూరంగా ఉండండి అంటూ పేర్కొన్నాడు.

కామంతో మునిగితేలేవారు: కామంతో మునిగిపోయే వ్యక్తిని ఎప్పుడూ విశ్వసించకూడదు. అలాంటి వ్యక్తిని నమ్మడం ద్వారా, ఒక వ్యక్తి పెద్ద సమస్యలో చిక్కుకునే అవకాశముంది. అందుకే అలాంటి వారితో ఎప్పుడూ దూరం పాటించండి. ఈ వ్యక్తుల వల్ల మీరు పరువు ప్రతిష్టకు భంగం కలగడమే కావకు.. చాలా నష్టాలను కూడా ఎదుర్కోవలసి రావచ్చు.

అసూయతో ఉండే వ్యక్తులు: మీ పట్ల అసూయపడే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. అలాంటి వారు మీరు విజయం సాధించడాన్ని అస్సలు చూడలేరు. మీరు ముందుకు వెళ్లకుండా నిరోధించడానికి అనేక అడ్డంకులను సృష్టిస్తారు. అందుకే వీరిని దరిచేరనివ్వొద్దని చాణుక్యుడు తెలిపాడు.





























