Konark Sun Temple: రథాన్ని పోలిన ఆలయం.. కోణార్క్ సన్ టెంపుల్ లో అడుగడుగునా విశేషాలే..
భారతదేశం అనేక సంస్కృతి సంప్రదాయాలకు ఆయువు పట్టు. రాజుల కాలం నుంచి నేటి వరకు దేశంలో ఎన్నో రకాల సంస్కృతులు అభివృద్ధి అయ్యాయి. అవుతూనే ఉన్నాయి. వీటికి గుర్తులుగా పురాతన ఆలయాలు, చారిత్రక...
భారతదేశం అనేక సంస్కృతి సంప్రదాయాలకు ఆయువు పట్టు. రాజుల కాలం నుంచి నేటి వరకు దేశంలో ఎన్నో రకాల సంస్కృతులు అభివృద్ధి అయ్యాయి. అవుతూనే ఉన్నాయి. వీటికి గుర్తులుగా పురాతన ఆలయాలు, చారిత్రక కట్టడాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒడిశా రాష్ట్రంలోని కోణార్క్ గురించి. సూర్య దేవాలయానికి ప్రసిద్ధి గాంచిన ఈ ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపద- యునెస్కో గుర్తింపు కూడా పొందింది. కోణార్క్ సూర్య దేవాలయం ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. శిల్పకళా అద్భుతం అయిన ఈ ఆలయం, ఏడు గుర్రాలు లాగిన సూర్య భగవానుడి రథాన్ని పోలి ఉండేలా నిర్మించారు. కోణార్క్ సూర్య దేవాలయం గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కోణార్క్ అనే పదం రెండు పదాల నుంచి వచ్చింది. కోన అంటే మూల అని, ఆర్క్ అంటే సూర్యుడు అని అర్థం. ఇది చంద్రభాగ నది ఒడ్డున నిర్మితమైంది. ప్రధాన ఆలయ సముదాయంలోని భారీ సూర్య విగ్రహంపై సూర్యుని కిరణాలు పడే విధంగా నిర్మించారు.
క్రీస్తుశకం1250లో తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ముస్లిం ఆక్రమణ దారులను ఓడించిన తరువాత, నరసింహదేవుడు కోణార్క్‌లో సూర్య దేవాలయాన్ని నిర్మించాడని చరిత్రకారులు చెబుతున్నారు. 15వ శతాబ్దంలో ఆక్రమణ దారులు ఈ ఆలయాన్ని దోచుకున్నారు. పూజారులు సూర్య భగవానుడి విగ్రహాన్ని భద్రపరిచారు. ఆ సమయంలో ఆలయం మొత్తం తీవ్రంగా ధ్వంసమైంది. బ్రిటీష్ పాలనలో పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాక కోణార్క్ కొత్త రూపు సంతరించుకుంది.
ఈ ఆలయాన్ని సూర్య భగవానుడి రథం ఆకారంలో నిర్మించారు. ఈ రథానికి 24 చక్రాలు ఉన్నాయి. 7 గుర్రాలు లాగుతున్నట్లు కనిపిస్తాయి. ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులను సూచిస్తాయి. 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయి. హిందూ క్యాలెండర్‌లో శుక్ల పక్షం, కృష్ణ పక్షం ఉన్నందున మిగిలిన పన్నెండు కూడా వాటినే సూచిస్తాయి. సూర్య భగవానుడి విగ్రహం పూరీ జగన్నాథ ఆలయంలో భద్రంగా ఉంది. ఫలితంగా ఈ ఆలయంలో దేవత విగ్రహం లేదు. ఇది కాలగమనాన్ని వర్ణిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..