Chanakya Niti: పెళ్లి తర్వాత సంతోషంగా ఉండాలంటే పెళ్ళికి ముందు ఈ విషయాలు తెలుసుకోమంటున్న చాణక్య..

భార్య భర్తలు ఒకరినొకరు తెలుసుకోవటానికి సమయం పడుతుంది. ఇద్దరు వేర్వేరు కుటుంబం నుంచి రావడంతో పెళ్లి తర్వాత ఆ బంధంలో ఆనందాన్ని తీసుకురావడానికి చాలా త్యాగం చేయాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉండేందుకు చాణక్యుడు అనేక చర్యలను కూడా పేర్కొన్నాడు. అందులో కొన్ని పెళ్లి చేసుకోవడానికి ముందు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి.

Chanakya Niti: పెళ్లి తర్వాత సంతోషంగా ఉండాలంటే పెళ్ళికి ముందు ఈ విషయాలు తెలుసుకోమంటున్న చాణక్య..
Acharya Chanakya Niti
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 09, 2024 | 2:52 PM

ఆచార్య చాణుక్యుడు గొప్ప ఆర్థికవేత్త, దౌత్యవేత్త, గొప్ప వ్యూహకర్త, రాజకీయ వేత్త .. మానవ జీవితాన్ని, సమాజాన్ని తనదైన కోణంలో ఆవిష్కరించిన మహనీయుడు. జీవితంలో అతి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు చాణక్య నీతిని తెలుసుకోవడం వలన పురోగమనం మీ సొంతం. జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపవచ్చు. చాణక్యుడి మాటలు జీవితాన్ని సంతోషంగా మార్చడానికే కాదు వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేయడానికి కూడా ఉపయోగపడతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉండేందుకు చాణక్యుడు అనేక విషయాలను సూచించాడు. వాటిని పాటిస్తే వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. అవి దాంపత్య జీవితంలో సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. ఈ రోజు చాణక్యుడు చెప్పిన విషయాలు గురించి తెలుసుకుందాం..

దంపతుల మధ్య చిన్న అపార్ధం ఉన్నా సరే ఆ సంబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం చాలా కష్టం. అదే సమయంలో వివాహ సంబంధాలు చాలా సున్నితంగా ఉంటాయి. వివాహ సంబంధంలోని మాధుర్యాన్ని కొనసాగించడానికి అనేక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. భార్య భర్తలు ఒకరినొకరు తెలుసుకోవటానికి సమయం పడుతుంది. ఇద్దరు వేర్వేరు కుటుంబం నుంచి రావడంతో పెళ్లి తర్వాత ఆ బంధంలో ఆనందాన్ని తీసుకురావడానికి చాలా త్యాగం చేయాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉండేందుకు చాణక్యుడు అనేక చర్యలను కూడా పేర్కొన్నాడు. అందులో కొన్ని పెళ్లి చేసుకోవడానికి ముందు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి.

చాణక్యుడి ప్రకారం వైవాహిక జీవితంలో చిన్న స్పర్ధ ఏర్పడితే అప్రమత్తంగా ఉండాలి. అయితే పెళ్లికి ముందు కాబోయే భాగస్వామిని గురించి తెలుసుకునేందుకు తప్పనిసరిగా మూడు ప్రశ్నలు అడగాలి. అప్పుడు వివాహానంతరం పవిత్రమైన సంబందంలో చీలికలు రావు.

ఇవి కూడా చదవండి

వివాహానికి సరైన వయస్సు

ఆచార్య చాణక్యుడి నీతి ప్రకారం వివాహానికి ముందు కాబోయే భాగస్వామి వయస్సును తప్పనిసరిగా తెలుసుకోవాలి. భార్యాభర్తల మధ్య వయోభేదంతోనే వారి మధ్య అవగాహన ఉంటుందని.. దంపతుల మధ్య అవగాహన లేకపోతే వైవాహిక జీవితం విచ్ఛిన్నానికి కారణం అవుతుంది. ఇద్దరి మధ్య అవగాహన కుదరకపోతే గొడవలు వచ్చే అవకాశం ఉంది. అందుకే భార్యాభర్తల మధ్య వయస్సు అంతరం ఎక్కువగా ఉండకూడదు. వయోబేధం ఎక్కువగా ఉంటే దాంపతుల మధ్య కలహాలకు అంతం ఉండదు.

ఆరోగ్యం గురించి సమాచారం

ఆచార్య చాణక్య నీతి ప్రకారం వివాహానికి ముందు కాబోయే భాగస్వామికి సంబంధించిన అన్ని ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవాలి. శారీరకంగా లేదా మానసికంగా ఏదైనా సమస్య ఉంటే స్పష్టంగా చెప్పాలి. ఇలా చేయడం వలన భవిష్యత్తులో ఇద్దరికీ ఇబ్బందులు కలుగవు.

పాత సంబంధాలు

ఆచార్య చాణక్యుడు పెళ్లికి ముందు కాబోయే భాగస్వామికి సంబంధించిన గత సంబంధం గురించి అడగాలి లేదా తెలుసుకోవాలి అని నమ్ముతారు. తమ సంబంధం గురించి పెళ్ళికి ముందే చెప్పడం వలన భవిష్యత్ వైవాహిక జీవితానికి చాలా మంచిది. దాపరికం లేని దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు