Independence Day 2024: స్వాతంత్యం కోసం పోరాటం చేసిన తెలుగు యోధులు ఎందరో .. మీ త్యాగం మరువం..

ఎందరో చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా బ్రిటిష్ పాలన నుంచి భారత దేశం విముక్తి పొంది 1947లో ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి భారత దేశానికి స్వాతంత్ర్యం లభించింది. అప్పటి నుంచి ఆగష్టు 15వ తేదీని భారత దేశం స్వాతంత్య దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి ధిల్లీ నుంచి గల్లీ వరకూ ప్రజలు రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని తమ ప్రతాపాన్ని రుచి చూపించి .. బ్రిటిష్ అధికారులకు ముచ్చెమటలు పట్టించిన కొందరు తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Independence Day 2024: స్వాతంత్యం కోసం పోరాటం చేసిన తెలుగు యోధులు ఎందరో .. మీ త్యాగం మరువం..
Telugu Freedom Fighters
Follow us
Surya Kala

|

Updated on: Aug 09, 2024 | 1:05 PM

బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర్య ఉద్యమంలో మేము సైతం అంటూ తెలుగువారు ఎందరో పాల్గొన్నారు. భారత దేశ దాస్య విముక్తి కోసం ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారు సైతం గణనీయమైన కృషి చేశారు. ఎందరో చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా బ్రిటిష్ పాలన నుంచి భారత దేశం విముక్తి పొంది 1947లో ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి భారత దేశానికి స్వాతంత్ర్యం లభించింది. అప్పటి నుంచి ఆగష్టు 15వ తేదీని భారత దేశం స్వాతంత్య దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి ధిల్లీ నుంచి గల్లీ వరకూ ప్రజలు రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని తమ ప్రతాపాన్ని రుచి చూపించి .. బ్రిటిష్ అధికారులకు ముచ్చెమటలు పట్టించిన కొందరు తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి: తెలుగు స్వాతంత్ర్య సమరయోధులలో మొదటి వ్యక్తీ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో 1806 నవంబర్ 24న జన్మించారు. బ్రిటీష్ వారు ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి 1847 లో బ్రిటిష్ వారి పై తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. చేశారు. 3000 పైగా బ్రిటిష్ పాలకులని చంపినట్లు చరిత్ర కథనం. అయితే నమ్మకం ద్రోహం వలన బ్రిటిష్ అధికారులకు పట్టుబడిన నరసింహా రెడ్డిని 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీశారు. అంతేకాదు బ్రిటిష్ వారు అంటే భయపడాలని.. మళ్ళీ విప్లవం ప్రజల మధ్య రావద్దు అంటూ నరసింహా రెడ్డి తలను 1877 వరకూ కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు

అల్లూరి సీతారామ రాజు: స్వాతంత్ర్య పోరాటం అనగానే తెలుగువారి మదిలో మెదిలే పేరు అల్లూరి సీతారామ రాజు. జులై 1897 భీమునిపట్నంలో జన్మించారు అల్లూరి ఫ్యామిలీ తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాలోని భీమవరంలో స్థిరపడ్డారు. బ్రిటిష్ వారి పాలనలోని అరాచకాలను స్వయంగా చూడడం కోసం 1921 లో దేశయాటన చేశారు. కోలకతా వరకూ నడిచి పర్యటించారు. 1922 రంపలో తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. బ్రిటిష్ పోలీస్ స్టేషన్ల నుంచి ఆయుధాలు దొంగలించి వాటితోనే బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన మన్యం వీరుడు. చివరకు పిన్న వయసులోనే దేశంలో ప్రాణాలను పోగొట్టుకున్నారు. కెఎల్ పురం కొండ ప్రాంతం లో ఆయనను దహనం చేశారు.

ఇవి కూడా చదవండి

పింగళి వెంకయ్య: భారత దేశ జాతీయ జెండా రూప కర్త పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు వివిధ జాతీయోద్యమాల్లో పాల్గొన్నారు. వందేమాతరం, హోమ్‌రూల్ ఉద్యమం, తన గొంతుక వినిపించారు. జూలై 4, 1963, విజయవాడలో పింగళి గారు మరణించారు. ఆయన మరణాంతరం 2009లో పింగళి వెంకయ్య పోస్టల్ స్టాంప్‌ను రిలీజ్ చేశారు. 2011లో భారతరత్న అవార్డు లభించింది.

భోగరాజు పట్టాభిసీతారామయ్య: మహాత్మా గాంధీ చే ప్రభావితమైన భోగరాజు పట్టాభిసీతారామయ్య స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని.. అతి తక్కువ సమయంలోనే గాంధీకి సన్నిహితుడిగా మారారు. 1948లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఎంపికయ్యారు. స్వాతంత్య్రం లభించిన తర్వత ఎంపీగా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ గవర్నర్ కూడా విధులు నిర్వహించారు. మాచలీపట్నంలో ఆంధ్రా బ్యాంక్ ను స్థాపించారు.

దుర్గాభాయి దేశ్ ముఖ్: మగవారికి ఏమి తక్కువ కాదు అవసరం అయితే ఆడది అబల కాదు సబల అని నిరూపించిన వారిలో దుర్గాభాయి దేశ్ ముఖ్ ఒకరు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ మధ్యతరగతి ఫ్యామిలీలో జన్మించిన దుర్గాభాయి 12 ఏళ్ల వయసులోనే దేశ సేవకు నడుం కట్టారు. స్వాతంత్య్రం పోరాటం కోసం వివరాలు సేకరించి గాంధీజీ కి అందజేశారు. గాంధీ జీ ఆంధ్రప్రదేశ్ లో సందర్శించే సమయంలో తెలుగులో అనువాదం చేసేవారు దుర్గాభాయి

టంగుటూరి ప్రకాశం పంతులు: ఆంధ్ర కేసరి బిరుదుని పొందిన టంగుటూరి ప్రకాశం బిపిన్ చంద్ర పాల్ ప్రసంగాలతో స్పూర్తిని పొంది దేశ స్వాతంత్య్రం పోరాటంలో పాల్గొన్నారు. తనకు ఉన్నదంతా దేశ మాత సేవ కోసం ధారబోసిన సేవా తత్పరుడు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..