AndhraPradesh: గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యే ఔదార్యం.. 9 లక్షల సొంత నిధులతో అంబులెన్స్ ఏర్పాటు..
వాహనం పై కూటమి నేతలతో, స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్ర పటాలతో వాహనం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే. అత్యవసర వైద్య సేవలు, హటాత్తు మరణం, ఆసుపత్రిలో మృతి చెందిన మృత దేహాలను తమ ఇళ్లకు తరలించేందుకు గిరిజనుల కోసం భర్త విజయ భాస్కర్ సహకారం తో వాహనాన్ని ఏర్పాట్లు చేశారు ఎమ్మెల్యే శిరీష దేవీ.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష తన సొంత కారును అంబులెన్స్ గా మార్చేశారు. గిరిజనులు అత్యవసరంగా వైద్యం అందక ఇబ్బందులు పడడం చూసి తన సొంత నిధులు 9 లక్షల రూపాయలతో emi పద్ధతి ద్వారా కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు. ఆదివాసి దినోత్సవం కావడంతో ప్రజలకు అందుబాటులో ఈ ఆంబులెన్స్ ప్రారంభించారు శిరీష. వాహనం పై కూటమి నేతలతో, స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్ర పటాలతో వాహనం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే.
అత్యవసర వైద్య సేవలు, హటాత్తు మరణం, ఆసుపత్రిలో మృతి చెందిన మృత దేహాలను తమ ఇళ్లకు తరలించేందుకు గిరిజనుల కోసం భర్త విజయ భాస్కర్ సహకారం తో వాహనాన్ని ఏర్పాట్లు చేశారు ఎమ్మెల్యే శిరీష దేవీ. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వాహనాన్ని జిల్లా ప్రజలకు అందించారు ఎమ్మెల్యే శిరీష … గిరిజన ప్రాంతం అభివృద్ధికీ, పెద్ద పిఠా వేసేందుకు తన వంతుగా ముందగు వేస్తున్నట్లు ఎమ్మెల్యే శిరీష తెలిపారు.. గిరిజన కష్టాలను దగ్గరగా చూసిన వ్యక్తి కావడం తో రంపచోడవరం మన్యం ప్రాంతంలో గిరిజనుల కంటి నుండి చిరు నవ్వే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే శిరీష వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…