YS Jagan: నంద్యాలలో మాజీ సీఎం జగన్ పర్యటన.. హత్యకు గురైన వైసీపీ నేత కుటుంబానికి పరామర్శ
ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు మాజీ సీఎం జగన్. ఇటీవల జిల్లాలో హత్యకు గురైన సుబ్బారాయుడి కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. లోకేష్ ఆదేశాలతోనే రాష్ట్రవ్యాప్తంగా హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి.
ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు మాజీ సీఎం జగన్. ఇటీవల జిల్లాలో హత్యకు గురైన సుబ్బారాయుడి కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. లోకేష్ ఆదేశాలతోనే రాష్ట్రవ్యాప్తంగా హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి. టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన నంద్యాల జిల్లా వైసీపీ నేత సుబ్బారాయుడి కుటుంబానికి YCP అండగా ఉంటుందన్నారు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.
నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో గత శనివారం దారుణహత్యకు గురయ్యాడు వైసీపీ నేత పసుపులేటి సుబ్బారాయుడు. రాళ్లతో కొట్టి, ఆ తర్వాత నరికి చంపారు దుండగులు. గ్రామానికి చెందిన చెందిన టీడీపీ నేతలే చంపారని మృతుడి భార్య ఆరోపిస్తోంది. ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వడంతోనే ఈ హత్య జరిగిందని సుబ్బారాయుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఇవాళ సుబ్బారాయుడి కుటుంబాన్ని పరామర్శిస్తారు వైసీపీ అధినేత జగన్. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.
మరోవైపు రెండు నెలలుగా ఏపీలో జరుగుతున్న హత్యలు, హత్యాయత్నాలపై మరోసారి యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు జగన్. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా నవాబ్‌పేటలో దుండగుల చేతిలో గాయపడి, విజయవాడ సన్‌రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ నేతలు శ్రీనివాసరావు, రామకృష్ణలను పరామర్శించారు జగన్. అదే సమయంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను దేశం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఇప్పటికే ఓసారి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో మీటింగ్ నిర్వహించి, తమ వాయిస్ వినిపించారు జగన్. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై వివిధ జాతీయ పార్టీలకు వివరించారు. మరోసారి కూడా దీనిపై వాయిస్ వినిపించేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీకి చెందినవారే దాడులు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..